అన్వేషించండి

Thalaivar171: రజినీకాంత్ మూవీలో శృతిహాసన్ - అలాంటి పాత్రలో ఫస్ట్ టైమ్

లోకేష్ కనగరాజ్ - రజినీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో శృతిహాసన్ సూపర్ స్టార్ కూతురిగా కనిపించనుందట. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Shruti Haasan As Rajinikanth's Daughter : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం రజనీకాంత్‌ను వరుస ప్లాపుల నుంచి ఉపశమనం కలిగించింది. అంతేకాదు గత ఏడాది కోలీవుడ్లో అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 'జైలర్' సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసినా రజినీకాంత్ వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ప్రస్తుతం 'వేట్టాయాన్' సినిమాతోపాటు లోకేష్ కనగరాజ్ తో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'తలైవార్171' అనే వర్కింగ్ టైటిల్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ కోలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

రజినీకాంత్ కూతురిగా శృతిహాసన్

కోలీవుడ్ స్టార్ హీరోలతో ఓ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసిన లోకేష్ రజనీకాంత్‌తో సినిమాని అనౌన్స్ చేయగానే ఈ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే రజినీకాంత్ తో తాను చేయబోయే సినిమాకి తన గత సినిమాలతో ఎలాంటి సంబంధం లేదని, ఈసారి ఓసారి కొత్త కథతో సినిమా చేస్తున్నట్లు లోకేష్ స్వయంగా వెల్లడించాడు. కాగా ఈ మూవీ గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్ మాఫియా డాన్ గా కనిపిస్తారట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమాలో రజనీకాంత్ కూతురుగా కమలహాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నటించిబోతున్నట్లు సమాచారం. కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించి దాదాపు 25 ఏళ్లు కావస్తోంది. ఇలాంటి తరుణంలో కమల్ కూతురు శృతిహాసన్ రజనీకాంత్ కూతురిగా నటిస్తుండడం కోలీవుడ్ లో సర్వత్ర ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ నెల 22న టైటిల్ అనౌన్స్ మెంట్

రజనీకాంత్ తో తాను చేయబోతున్న సినిమా టైటిల్ ని అలాగే టీజర్‌ను ఈనెల 22న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల స్వయంగా తెలియజేశారు. కాగా ఈ చిత్రానికి 'కళుగు' అని టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతుంది. మరి తెలుగులో ఎలాంటి టైటిల్ పెడతారో చూడాలి. ఈ ఏడాది జూన్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

మూడేళ్ల తర్వాత కోలీవుడ్ లో

శృతిహాసన్ కోలీవుడ్లో కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే గత ఏడాది టాలీవుడ్ లో మాత్రం హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. 2023లో శృతిహాసన్ నటించిన 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి', 'సలార్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్నాయి. టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న శృతిహాసన్ సుమారు మూడేళ్ల తర్వాత కోలీవుడ్లో నటించబోతోంది. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురిగా కనిపించనుండటం విశేషం. రజినీ మూవీలో కమల్ కూతురు నటించడం ఇదే ఫస్ట్ టైమ్.

Also Read : సంయుక్తకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు - తెలుగులో డబుల్ హ్యాట్రిక్ కొడుతుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి - రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
RAPO22 Title: రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!
రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!
Southern Stalin: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
Embed widget