అన్వేషించండి

Pragathi : మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇది చాలా చీప్ - నటి ప్రగతి ఆగ్రహం

ప్రముఖ నటి ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ తాజాగా కొన్ని వార్తలు వైరల్ అవ్వడంతో ఈ వార్తలపై నటి ప్రగతి తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసింది.

టాలీవుడ్ లో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతుందని తాజాగా కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. ఆ వార్తలపై ప్రగతి స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేసింది. అలాంటి వార్తల వల్ల తాను ఎంతో బాధపడ్డానని, అసలు తన పర్సనల్ లైఫ్ లోకి రావడం.. ఆధారాలు లేకుండా వార్తలు రాసే హక్కు ఎక్కడిదంటూ ఆ వార్తలను ప్రచురించిన మీడియా సంస్థలపై తీవ్రస్థాయిలో మండిపడింది. వివరాల్లోకి వెళ్తే.. అగ్ర హీరోల సినిమాల్లో అక్క, వదిన, అమ్మ పాత్రలతో క్యారెట్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రగతి. సోషల్ మీడియాలోనూ ఆమె ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

తన మీద ఎలాంటి రూమర్స్ వచ్చినా, ట్రోలింగ్స్ వచ్చినా వాటిపై రెస్పాండ్ అవుతూ తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా నటి ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ గా మారాయి. కొన్ని మీడియా సంస్థలు ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రాయడంతో రెండో పెళ్లి పై వచ్చిన రూమర్స్ ని ఖండిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది.

ఆ వీడియోలో ప్రగతి మాట్లాడుతూ.. "ప్రముఖ మీడియా సంస్థ నుంచి ఇలాంటి రూమర్లు రావడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇది బాధ్యత రాహిత్యమే అవుతుంది. అక్కడ ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. నేను ఒక నటిని కాబట్టి మీరు ఏమైనా రాయవచ్చని అనుకోవడం తప్పు.. మీకేం హక్కు ఉందండి, ఒకరి వ్యక్తిగత జీవితంలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా రాయడానికి. మీకేం హక్కు ఉంది. ఏం ఆధారం లేకుండా ఎలా రాస్తారు? మీ దాంట్లో ఎవరైనా కలగని ఇలా రాశారా? నేను దీన్ని ఖండిస్తున్నాను. ఓ ప్రముఖ మీడియా సంస్థ నుంచి ఇలాంటి వార్త రావడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రాసే ముందు కాస్త చెక్ చేసుకోండి. నిజ నిజాలు తెలుసుకోండి" అని తెలిపింది.

"ఒకరి గురించి రాసేముందు ఎంతవరకు రాయొచ్చో తెలుసుకోండి. ఆధారాలు ఉంటే రాయండి. అసలు అలాంటి విషయం ఉంటే నేనే చెబుతాను కదా! అంతేగాని ఇలాంటి వార్తలు రాసి సంస్థను చీప్ చేయకండి. ఇది చాలా చీప్. నా ఆత్మగౌరవాన్ని ఇలా దిగజార్చడం నాకు బాధగా ఉంది. నేను దీన్ని ఖండిస్తున్నాను. ఇక నుంచి అయినా బాధ్యతతో ఉండండి. ప్రొఫెషనల్ ఎథిక్స్, జర్నలిజం ఎథిక్స్ అనేవి ఉంటాయి కదా. ఆధారం లేకుండా, బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయకుండా రాయవద్దు అనేది ఉంటుంది. ఇది అన్ ప్రొఫెషనల్, అన్ ఎథికల్, వెరీ ఇర్రెస్పాన్సిబుల్. ఇకపై ఇలా చేయకండి.." అంటూ వీడియోలో పేర్కొంటూ ఇలాంటి వార్తలు రాసే మీడియా సంస్థలకి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది నటి ప్రగతి. ఇదిలా ఉంటే ఓ స్టార్ ప్రొడ్యూసర్ తో ప్రగతి రెండో పెళ్లి అంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రచురించగా.. ఈ వార్తలను ఖండిస్తూ నటి ప్రగతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Also Read : సినిమా షూటింగ్‌లోకి చొరబడ్డ దుండగులు - హీరోయిన్‌‌ను కత్తితో బెదిరిస్తూ అసభ్య చేష్టలు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget