అన్వేషించండి

సినిమా షూటింగ్‌లోకి చొరబడ్డ దుండగులు - హీరోయిన్‌‌ను కత్తితో బెదిరిస్తూ అసభ్య చేష్టలు

సినిమా షూటింగ్ జరుగుతుండగా కన్నడ నటి శుభం పూంజపై కొందరు దుండగులు బైక్ పై వచ్చి సెట్స్ లో చొరబడి అసభ్యంగా ప్రవర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఒక్కసారిగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అగ్ర నటీనటులకు అభిమానులు ఉండడం సహజం. తమ అభిమాన నటీనటులపై ఒక్కోసారి ఫ్యాన్స్ చేసే పనులు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఆ అభిమానం హద్దులు దాటితే కొన్నిసార్లు అది ఇబ్బందిగా మారుతుంది. ఫ్యాన్స్ అని చెప్పుకునే కొంతమంది సదరు నటీనటులతో ఒక్కోసారి మితిమీరి ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన మరోసారి బయటపడింది. తాజాగా ఓ మూవీ షూటింగ్లో జరిగిన సంఘటన అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ప్రస్తుత ఆ సంఘటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

కర్ణాటక  చిక్కమగలురులోని ఓ ప్రాంతంలో 'కొరగజ్జ' అనే కన్నడ చిత్రం కోసం పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో భాగంగా నటి శుభం పూంజా తోపాటు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య సెట్ లో ఉన్నారు. అయితే చిత్రీకరణ జరుగుతున్న సమయంలో అక్కడికి బైక్ పై వచ్చిన కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో షూటింగ్ ప్రాంతంలోకి చొరబడ్డారు. అంతేకాకుండా ఆ దుండగులు నటి పూజతో అనుచితంగా ప్రవర్తించారని ఆమె చేయి పట్టుకుని లాగేందుకు కూడా ప్రయత్నించారని తెలిసింది. ఈ ఘటనతో షూటింగ్ కూడా నిలిపివేశారట. ఈ ఘటన కుదేముక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినప్పటికీ చిత్ర బృందం దీనిపై అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.

ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు." లక్షల రూపాయలు వెచ్చించి సెట్ ను నిర్మించే ముందు సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నామని ఇప్పుడు ఈ ఘటనతో పాట చిత్రీకరణను ఆపేసామని" తాజాగా చిత్ర దర్శకుడు సుధీర్ అత్తవర మీడియాకు తెలియజేశారు. ఈ సినిమా బృందం పాట చిత్రీకరణ కోసం బాలీవుడ్ నుండి ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యను కూడా నియమించుకున్నారు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? నటి పూంజాతో ప్రవర్తించిన ఆ దుండగులు ఎవరు? ఆమెకు వాళ్లతో సంబంధం ఏంటి? దీని వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఘటన ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా దీనికంటే ముందు కొన్నాళ్ల క్రితం ప్రముఖ మలయాళ నటిని వెంబడించి మార్గమధ్యంలో కిడ్నాప్ చేసిన ఘటన ఎంతటి సంచలమైందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ హీరో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అతనిపై విచారణ కూడా సాగింది. ఆ తర్వాత తాజాగా నటి శుభం పూంజా పై జరిగిన ఘటన మరోసారి సినీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక శుభం పూంజా విషయానికొస్తే.. మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈమె పలు కన్నడ, తమిళ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా 'మొగ్గిన మనసు' అనే కన్నడ చిత్రంలో శుభం పూంజా నటనకి మంచి గుర్తింపు వచ్చింది.

Also Read : 'కన్నప్ప' షూటింగ్‌లో ప్రమాదం, మంచు విష్ణుకు గాయాలు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget