Manchu Vishnu: 'కన్నప్ప' షూటింగ్‌లో ప్రమాదం, మంచు విష్ణుకు గాయాలు!
‘కన్నప్ప‘ మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంచు విష్ణుకు గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ నిలిచిపోయింది.
వరుస పరాజయాలతో కెరీర్ కొనసాగిస్తున్న మంచు విష్ణు, ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. దిగవంగత నటుడు కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని తిరిగి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజీలాండ్ లో కొనసాగుతోంది. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. శ్రీ కాళహస్తిలో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ అంతా న్యూజీలాండ్ లోనే కంప్లీట్ కానున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది.
షూటింగ్ లో ప్రమాదం, మంచు విష్ణుకు గాయాలు
తాజాగా ‘కన్నప్ప’ షూటింగ్ సెట్ లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నటుడు మంచు విష్ణుకు గాయాలు అయ్యారు. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో డ్రోన్ కెమెరా మంచు విష్ణు మీదికి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆయన చేతులతో పాటు శరీరంపై మరికొన్ని చోట్ల గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే చిత్రబృందం ఆయను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందించి కాస్త రెస్ట్ తీసుకోవాలని సూచించారట. అటు ఈ ప్రమాదంతో దర్శకుడు సినిమా షూటింగ్ నిలిపి వేసినట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలియడంతో మంచు విష్ణు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చిన్న గాయాలే అయ్యాయని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్ లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.
Vishnu Manchu, who is busy with the shooting of his dream project #Kannappa in New Zealand sustained injuries during the shoot of an action sequence.
— Aakashavaani (@TheAakashavaani) October 29, 2023
As per the sources, Vishnu sustained several injuries on his hand when the drone crashed into him. The shooting has been put on…
రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘కన్నప్ప‘
ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాన్ని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణుకి జోడీగా బాలీవుడ్ నటి నుపుర్ సనన్ ఫిక్స్ అయినా, కొన్ని కారణాలతో ఆమె తప్పుకుంది. ప్రస్తుతం మరో హీరోయిన్ ను తీసుకునే పనిలో పడింది చిత్రబృందం. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ సినిమాకు కథను అందిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తున్నారు.
‘కన్నప్ప‘ మంచు విష్ణు కెరీర్ ను మలుపు తిప్పేనా?
గత కొంత కాలంగా మంచు విష్ణు వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన చివరిగా నటించిన ‘మోసగాళ్లు, ‘జిన్నా’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ‘కన్నప్ప’ సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాతో మంచు విష్ణు కెరీర్ మారిపోయే అవకాశం ఉందని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.
Read Also: లవ్ ఫెయిల్యూర్తో మంచే జరిగింది, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial