Kangana Ranaut: లవ్ ఫెయిల్యూర్తో మంచే జరిగింది, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
లవ్ ఫెయిల్యూర్ గురించి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ సంబంధం ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పిన ఆమె, ప్రేమలో అందరూ సక్సెస్ కాలేరని వెల్లడించింది.
కంగనా రనౌత్. సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది. ఏ విషయాన్ని అయినా డేర్ అండ్ డ్యాషింగ్ గా కుండబద్దలు కొడుతుంది. తన అభిప్రాయాన్ని సుత్తి లేకుండా సూటిగా చెప్తుంది. అంశం ఏదైనా తనదైన శైలిలో గళం విప్పుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన లవ్ ఫెయిల్యూర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
లవ్ ఫెయిల్యూర్ ను గుర్తు చేసుకున్న కంగనా
వాస్తవానికి సినీ తారల ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకుల వ్యవహారాలు నిత్యం వార్తల్లో నలుగుతూనే ఉంటాయి. చాలా మంది సినీ సెలబ్రిటీలో ప్రేమ వివాహానికే మొగ్గు చూపుతారు. పెళ్లి తర్వాత కొందరు హాయిగా సంసార జీవితాన్ని గడిపితే, మరికొంత మంది మూన్నాళ్లకే పడక విడాకులు తీసుకున్న సందర్భాలున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తన ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లవ్ ఫెయిల్యూర్ తన జీవితానికి ఎందో మంచి చేసిందని వెల్లడించారు. రీసెంట్ గా ఆమె నటించిన ‘తేజస్‘ మూవీ ప్రమోషన్ లో భాగంగా తన లవ్ ఫెయిల్యూర్ అంశాన్ని గుర్తు చేసుకుంది.
లవ్ ఫెయిల్యూర్ తో లాభమే ఉరిగింది- కంగనా
అన్ని సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని చెప్పిన కంగనా రనౌత్, ప్రేమలో అందరూ సక్సెస్ కాలేరని వెల్లడించింది. “ఏ సంబంధాలు అయినా ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు. చాలా మంది ప్రేమలో ఉంటారు. కానీ, అందరూ ప్రేమలో విజయం సాధించలేదు. నేను కూడా తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డాను. కొంతకాలం పాటు లవ్ లో కొనసాగాను. కానీ, కొన్ని కారణాలతో విడిపోవాల్సి వచ్చింది. విడిపోయాక కొద్ది కాలం చాలా బాధపడ్డాను. ప్రేమను గుర్తు చేసుకుని కంటతడి పెట్టాను. కానీ, కొన్నాళ్లు ప్రేమ నుంచి బయటకు వచ్చి మంచి పని చేశానని అర్థం అయ్యింది. ప్రేమలో ఉంటే, అదే ఆలోచనతో అక్కడే ఉండేదాన్ని. మరో ఆలోచన ఉండేది కాదు. కానీ, ఆ మైకం నుంచి బయటపడ్డాను. లవ్ ఫెయిల్యూర్స్ తో లాభాలు చాలా ఉంటాయి. అవి ఏంటో ప్రేమలో విఫలం అయిన వాళ్లకే తెలుస్తుంది. ఇది కేవలం ప్రేమ గురించి మాత్రమే. పెళ్లి గురించి కాదు. అందరిలాగే నాకు పెళ్లి చేసుకుని ఓ చక్కటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనుంది. కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం” అని కంగనా వివరించింది.
అటు కంగనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం ‘తేజస్’ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సర్వేష్ మేవారా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను, రోనీ నిర్మించారు. అటు ఆమె నటించిన మరో సినిమా 'ఎమర్జన్సీ' కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన కంగనా లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అచ్చం ఇందిరా కనిపిస్తున్నట్లుగానే ఉంది. ఈ చిత్రాలు సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెంచుతున్నాయి.
Read Also: ‘భారతీయుడు 2’ నుంచి అదిరిపోయే అప్ డేట్, గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial