అన్వేషించండి

Indian 2 Movie: ‘భారతీయుడు 2’ నుంచి అదిరిపోయే అప్ డేట్, గ్లింప్స్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

‘భారతీయుడు 2‘ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. గ్లింప్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

తమిళ సినిమా పరిశ్రమలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2‘. దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ‘ఇండియన్ 2‘ గ్లింప్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

‘ఇండియన్ 2’ గ్లింప్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

సుమారు రెండు దశాబ్దాల క్రితం శంకర్, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ‘భారతీయుడు‘ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.  రోజుల్లోనే ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ సాధించి కొత్త రికార్డులు నెలకొల్పింది. మళ్లీ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘ఇండియన్ 2‘ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ పలు మార్లు వాయిదా పడింది. ఇక సినిమా విడుదల విషయంలోనూ వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఓవైపు కమల్ హాసన్ తో ఈ సినిమా తెరకెక్కిస్తూనే, మరోవైపు రామ్ చరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా షూటింగ్ లోనూ పాల్గొన్నారు. ఈ రెండు సినిమాలకు సమానంగా డేట్స్ కేటాయించారు. గత కొద్ది రోజులుగా ‘ఇండియన్ 2‘ సినిమా నుంచి లాంటి అప్ డేట్స్ రాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ‘ఇండియన్ 2‘ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.  న‌వంబ‌ర్ 3న ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ కమల్ హాసన్ ప్రధానంగా కనిపిస్తుండగా, బ్యాగ్రౌండ్ లో జనాలు కనిపిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lyca Productions (@lycaproductions)

తెలుగు, తమిళంతో పాటు 5 భాషల్లో ‘ఇండియన్ 2’ విడుదల

కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో సిద్ధార్థ్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్  అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రెడ్ జెయింట్‌, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన  కమల్‌ లుక్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు ‘విక్రమ్’ మూవీతో అదిరిపోయే హిట్ అందుకుని మంచి జోష్ లో ఉన్న కమల్ హాసన్, అదే ఊపులో ‘ఇండియన్ 2’తోనూ సత్తా చాటాలి అనుకుంటున్నారు.  ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు 5 భాషల్లో విడుదల చేయనున్నారు.

Read Also: చియాన్ విక్రమ్ కొత్త మూవీ షురూ, అనౌన్స్‌మెంట్ వీడియో అదిరిందబ్బా!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ravi Mohan Vs Kushboo: 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?
'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న లక్ష్మీ! 7వ నెలలోనే డెలివరీ తప్పదా! సహస్రకూ నొప్పులు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న లక్ష్మీ! 7వ నెలలోనే డెలివరీ తప్పదా! సహస్రకూ నొప్పులు!
Mareechika Trailer Review : దెయ్యంతో డిస్కషన్ ఏంటి సార్... అసలెవరీ మరీచిక - సైకలాజికల్ థ్రిల్లర్‌గా అనుపమ కొత్త మూవీ
దెయ్యంతో డిస్కషన్ ఏంటి సార్... అసలెవరీ మరీచిక - సైకలాజికల్ థ్రిల్లర్‌గా అనుపమ కొత్త మూవీ
Aarti Ravi: సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay About Bandi Bhagirath: బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
YS Jagan: సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
Mahabubnagar Crime News: తనను ప్రేమించలేదని కత్తితో దాడి చేసి యువతి దారుణహత్య.. జడ్చర్లలో దారుణం
తనను ప్రేమించలేదని కత్తితో దాడి చేసి యువతి దారుణహత్య.. జడ్చర్లలో దారుణం
Aarti Ravi: సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
Vikarabad Crime News: తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!
తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
Embed widget