Rukmini Vasanth: రుక్మిణీ వసంత్ కాదు... కనకవతి - 'కాంతార' ప్రీక్వెల్‌లో హీరోయిన్ లుక్ రిలీజ్
Rukmini Vasanth In Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతార ఏ లెజెండ్ సినిమాలో హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'సప్త సాగరాలు దాటి' గుర్తు ఉందా? ఒకవేళ ప్రేక్షకులు ఎవరైనా సరే ఆ సినిమా మరిచిపోయినా... హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)ను మాత్రం మర్చిపోలేరు. అభినయంతో పాటు ఆవిడ అందం అంతగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆవిడ చేతిలో ఉన్న సినిమాలలో 'కాంతార' (Kantara Prequel) ప్రీక్వెల్ ఒకటి.
కనకవతిగా రుక్మిణీ వసంత్!
రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'కాంతార' పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఆ సినిమాకు ప్రీక్వెల్ 'కాంతార ఏ లెజెండ్' (Kantara A Legend Chapter 1) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో రుక్మిణి వసంత్ హీరోయిన్. కనకవతి పాత్రలో ఆవిడ నటిస్తున్నట్లు తెలియజేయడంతో పాటు ఇవాళ ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Introducing @rukminitweets as ‘KANAKAVATHI’ from the world of #KantaraChapter1.
— Hombale Films (@hombalefilms) August 8, 2025
ಕನಕವತಿಯ ಪರಿಚಯ ನಿಮ್ಮ ಮುಂದೆ.
कनकवती का परिचय आपके लिए.
కనకవతి ని మీకు పరిచయం చేస్తున్నాం.
கனகாவதியை பற்றிய அறிமுகம் உங்கள் முன் உள்ளது.
കനകാവതിയുടെ ആമുഖം നിങ്ങൾക്കുമുമ്പിൽ.
আপনাদের সামনে কনকবতীকে… pic.twitter.com/4JmMy901un
కాంతార ప్రీక్వెల్ షూటింగ్ పూర్తి
'కేజిఎఫ్', 'సలార్', 'కాంతార'తో పాటు రీసెంట్ 'మహావతార్: నరసింహ' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ప్రొడ్యూస్ చేసిన హోంబలే ఫిలిమ్స్ ఈ 'కాంతార ఏ లెజెండ్' ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఏడు భాషల్లో సినిమా విడుదల!
Kantara Chapter 1 Release Date: అక్టోబర్ రెండన 'కాంతార: చాప్టర్ 1' విడుదల చేయనున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. గాంధీ జయంతికి థియేటర్లలో సినిమా సందడి చేయనుంది. సాధారణంగా పాన్ ఇండియా రిలీజ్ అంటే హిందీతో పాటు దక్షిణాది నాలుగు భాషల్లో విడుదల చేస్తారు. కానీ ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ హిందీ భాషలలో మాత్రమే కాదు... ఇంగ్లీష్, బెంగాలీలోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు.





















