ప్రభాస్ మెచ్చిన కన్నడ సినిమా 'కాంతార' తెలుగు డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 15న విడుదలైంది.

కథ: ఓ ఊరి ప్రజలకు రాజు భూమిని దానంగా ఇస్తాడు. బదులుగా తనకు ప్రశాంత ఇచ్చే ఊరి దేవుడిని తీసుకువెళతాడు. 

రాజు వారసులు భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తే... దేవుడు, ఊరిలో శివ (రిషబ్ శెట్టి) ఏం చేశారు? అనేది సినిమా.

ఎలా ఉంది? : సినిమా ప్రారంభం, ముగింపు బావున్నాయి. అటవీ నేపథ్యంలో మత విశ్వాసాలను చక్కగా తెరకెక్కించారు.

కథగా చూస్తే... 'కాంతార' కొత్తగా ఉండదు. మనం చూసిన కథను ఊహించే విధంగా తీశారు. లవ్ ట్రాక్ రొటీన్‌గా ఉంది.

కథను తెరకెక్కించిన తీరు బావుంది. అటవీ వాతావరణాన్ని, పల్లె మనుషుల పాత్రలను సహజంగా చూపించారు.

అజనీష్ లోక్‌నాథ్ పాటలు కథలో భాగంగా వచ్చాయి. నేపథ్య సంగీతం ఫ్రెష్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ సూపర్.

ఆర్టిస్టులందరూ పాత్రలకు న్యాయం చేశారు. అచ్యుత్ కుమార్, కిశోర్, సప్తమి గౌడ నేచురల్ గా ఉన్నారు.

క్లైమాక్స్ తర్వాత... థియేటర్స్ నుంచి బయటకు వచ్చాక ప్రేక్షకులకు రిషబ్ శెట్టి ఒక్కరే గుర్తుంటారు. 

సినిమా అంతా ఒక ఎత్తు... పతాక సన్నివేశాల్లో రిషబ్ శెట్టి నటన, అజనీష్ సంగీతం మరో ఎత్తు. గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

'కాంతార' కన్నడ నేటివిటీ చిత్రమైనా... ఇంటర్వెల్ తర్వాత బోరింగ్ మూమెంట్స్ ఉన్నా... ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి.

సాధారణ సినిమాను మరో మెట్టు ఎక్కించిన ఘనత 'కాంతార' క్లైమాక్స్‌కు దక్కుతుంది. డోంట్ మిస్ ద క్లైమాక్స్.