షన్ను, దీప్తి ఇలా కలిశారు, ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి - ఇదిగో వీడియో యూట్యూబర్ దీప్తి సునైనాకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానుల్లో చాలామంది దీప్తి - షన్ముఖ్ జస్వంత్‌లను జంటగా చూసేందుకు ఇష్టపడతారు. దీప్తి - షన్ముఖ్‌ల బ్రేకప్ అభిమానులకు కూడా ఆందోళన కలిగించింది. కానీ, ఏదో ఒకరోజు ఇద్దరు మళ్లీ కలుస్తారనే ఆశతో ఉన్నారు. ఇటీవల దీప్తి సునైనా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లింది. అదే కార్యక్రమానికి షన్ముఖ్ జస్వంత్ కూడా వెళ్లాడు. అక్కడ షన్ను, దీప్తీలు మాట్లాడుకుంటారని, మళ్లీ కలుసుకుంటారని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు. షన్ముఖ్ దీప్తితో కరచలనం చేసి తన సీట్లో కూర్చున్నాడు. దీప్తి కూడా షన్నును చూసి చూడనట్లుగా, పట్టించుకోనట్లుగా కనిపించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. (Video Credit: our_man_shannu/Instagram) ‘బిగ్ బాస్’ తర్వాత దీప్తి సునైనా.. షన్ముఖ్‌కు బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. Images and Videos Credit: Deepthi Sunaina & Shanmukh Jaswanth/Instagram