అలా తొంగి చూస్తూ దొరికిపోయిన సిరి, శ్రీహాన్‌ను మిస్సవుతోందట యూట్యూబర్, సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ బిగ్ బాస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. సిరి-శ్రీహన్‌లకు ఇప్పటికీ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. శ్రీహన్ ప్రపోజ్ చేస్తాడని సిరి చానాళ్లు వెయిట్ చేసిందట. కానీ, చేయలేదు. దీంతో ఆమె ఓ రోజు వైజాగ్ బీచ్‌లో శ్రీహన్‌కు ఐ లవ్ చెప్పేసింది. ట్విస్ట్ ఏమిటంటే, శ్రీహన్ ఆ రోజు సిరి ప్రేమను రిజెక్ట్ చేశాడు. ఇందుకు కారణం సిరి హిందూ, శ్రీహన్ ముస్లిం. అప్పటికి సిరికి 19 ఏళ్లే. అయితే, వారం రోజుల తర్వాత శ్రీహన్ స్వయంగా సిరికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు సహజీవనం చేయడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించారు. సిరి-శ్రీహన్ ఓ బాల నటుడిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. శ్రీహాన్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఉండటంతో సిరి బాగా మిస్సవుతోందట. శ్రీహన్‌కు డ్రెస్‌లు ఇచ్చేందుకు వెళ్లిన సిరి ‘బిగ్ బాస్’ సెట్‌లోకి తొంగి చూస్తూ దొరికిపోయింది. ఈ వీడియోను ఆమె ఫ్రెండ్ జెస్పీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. Images Credit: Siri Hanumanthu, Shrihan/Instagram