మెహ్రీన్ జలకాలాటలు, హాట్ స్ప్రింగ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న హనీ! మెహ్రీన్ పిర్జాడా.. టాలీవుడ్‌లో అడుగు పెడుతూనే కుర్రాళ్ల మనసు దోచేసింది. ముద్దొచ్చే అందంతో తెలుగు ప్రేక్షకులకు భలే నచ్చేసింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ నుంచి ‘F3’ వరకు తన హవా సాగింది. సినిమాల కోసం ఆమె బాగా సన్నబడింది కూడా. అయితే, ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ‘స్పార్క్’ సినిమా ఒకటే ఉంది. కన్నడలో ‘నీ సిగువరేగు’ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం మెహ్రీన్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మెహ్రీన్ తన తల్లితో కలిసి ఐస్‌లాండ్‌లో ప్రత్యక్షమైంది. అక్కడి ప్రఖ్యాత హాట్ స్ప్రింగ్స్‌లో జలకాలాడుతూ కనిపించింది. Images and Videos Credit: Mehreen Pirzada/Instagram