వామ్మో, స్రవంతి - ఇలాగైతే.. పోతుంది కుర్రాళ్ల మతి! స్రవంతి చొకారపు.. ఈ బ్యూటీ ఇప్పుడు ఇంటర్వ్యూలతో బిజీగా మారిపోయింది. ‘పుష్ప’ ఇంటర్వ్యూతో బన్నీ అభిమానుల మనసు దోచింది స్రవంతి. అప్పటి నుంచి స్రవంతి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అదే ఆమెకు ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో కూడా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ‘బిగ్ బాస్’లో స్రవంతి తన అందంతో పిచ్చెక్కించింది. కానీ, ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అయితేనేం, స్రవంతి బోలెడంత పాపులారిటీ సంపాదించింది. ఇప్పుడు తన అందంతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా స్రవంతి పోస్ట్ చేసిన వీడియో మతిపోగడుతోంది. అంత అందాన్ని ఇంత లేటుగా చూశామా అని ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. Images and Videos Credit: Sravanti Chokarapu