విష్ణు మంచు 'జిన్నా' అక్టోబర్ 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన కాలేజీలకు వెళ్లి విద్యార్థులను కలిశారు. రాజమండ్రిలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, GEIT, కాకినాడలోని ఆదిత్య కాలేజీలకు విష్ణు మంచు టీమ్ వెళ్ళింది. అలాగే, విశాఖలోని చైతన్య, అవంతి కాలేజీలకు, శ్రీకాకుళంలోని AITAMకు కూడా వెళ్లారు. ప్రతి కాలేజీలో విష్ణు మంచుతో ఫోటోలు దిగడం కోసం విద్యార్థులు పోటీపడ్డారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించారు. స్టూడెంట్స్‌లో విష్ణు మంచుకు ఒక రేంజ్‌లో క్రేజ్ ఉందని ఆ టూర్ ఫొటోస్, వీడియోస్ చూస్తే తెలుస్తోంది. విష్ణుతో పాటు హీరోయిన్ పాయల్, రైటర్ కోన వెంకట్, కమెడియన్స్ చమ్మక్ చంద్ర, సద్దాం టూర్ లో పాల్గొన్నారు. టూర్ ముగించుకుని విష్ణు అండ్ టీమ్ హైదరాబాద్ వస్తోంది. హైదరాబాద్ వస్తున్న పాయల్, విష్ణు మంచు, కోన వెంకట్. తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో 'జిన్నా' రిలీజ్ అవుతోంది. 'మా' ఎన్నికలలో విష్ణు విజయం సాధించి ఏడాది పూర్తి అయ్యింది. (All images, videos courtesy : vishnu manchu instagram)