వావ్, స్నేహా రొమాంటిక్ ట్రిప్ - బర్త్‌డేకు ప్రసన్న ఊహించని సర్‌ప్రైజ్ అక్టోబర్ 12న స్నేహ పుట్టిన రోజు. ఈ సందర్భంగా భర్త ప్రశన్న ఆమెకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రకృతి అందాల మధ్య రొమాంటిక్ ట్రిప్‌ను ఇద్దరూ ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ముఖ్యంగా ఇంద్రధనస్సు ఫొటోలను చూస్తే మీకూ కూడా మనసు తేలికైపోతుంది. దక్షిణాది సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహ. హోమ్లీ పాత్రలతోనే కాదు, గ్లామరస్ క్యారెక్టర్స్‌తోనూ ఔరా అనిపించింది స్నేహ. స్నేహా తెలుగమ్మాయే. కానీ, తమిళంలోనే ఆమెకు ఎక్కువ గుర్తింపు లభించింది. తమిళ హీరో ప్రశన్న ప్రేమలో పడి, అతడినే పెళ్లి చేసుకుంది. Images Credit: Sneha/Instagram