థియేటర్లలో ఈ వారం చిన్న సినిమాలు, కన్నడ డబ్బింగ్ ఫిల్మ్స్ సందడి చేయనున్నాయి. అవేంటో చూడండి. హెబ్బా పటేల్ మూగ అమ్మాయిగా నటించిన 'గీత' ఈ నెల 14న విడుదలవుతోంది. ఇందులో సునీల్, సప్తగిరి ఉన్నారు. అది సాయికుమార్ హీరోగా నటించిన 'క్రేజీ ఫెలో' విడుదల కూడా అక్టోబర్ 14నే. అద్దెకు బాయ్‌ఫ్రెండ్ కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా 'బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్'. ఇదీ 14న విడుదలవుతోంది. KGF స్టార్ యశ్ హీరోగా నటించిన కన్నడ సినిమాను తెలుగులో 'రారాజు' పేరుతో 14వ తేదీన విడుదల చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా నటించిన 'నిన్నే పెళ్లాడతా' సినిమా విడుదల కూడా 14నే. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన 'కాంతారా' ఈ నెల 15న తెలుగులో విడుదలవుతోంది. రావు రమేశ్, ఆలీ, నరేశ్ తదితరులు నటించిన చిన్న సినిమా 'లెహరాయి' సైతం ఈ నెల 14న విడుదలవుతోంది. 'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా' సినిమా సైతం 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.