కారు నుంచి దిగడానికి ప్రణీత పాట్లు, మొబైల్ కూడా ఫసక్! పెద్ద పెద్ద కళ్లతో కుర్రాళ్ల మనసులో గూడు కట్టుకున్న నటి ప్రణీత. కరోనా టైమ్‌లో పెళ్లి చేసుకుని, పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. తాజాగా ఆమె తన బిడ్డతో ఫొటో షూట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె పెద్ద గౌను వేసుకుని కారు ఎక్కింది. ఆ తర్వాత ఆమె కారు నుంచి కిందకు దిగడానికి శ్రమించింది. ఆ ప్రయత్నంలో ఆమె చేతిలో మొబైల్ ఫోన్ కూడా కిందపడింది. ఆ వీడియోను ప్రణీత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ప్రస్తుతం ప్రణీత ఖాళీగానే ఉంది. చేతిలో సినిమాలేవీ లేవు. మళ్లీ రి-ఎంట్రీ ఇచ్చేందుకు ప్రణీత కసరత్తులు చేస్తోంది. Images and Videos Credit: Pranitha Subhash/Instagram