రాజమౌళికి ‘జక్కన్న’ పేరు పెట్టింది ఎవరో తెలుసా? దర్శకధీరుడు రాజమౌళిని ‘జక్కన్న’ అని కూడా పిలుస్తాం. 12వ శతాబ్దంలో హోయసల రాజుల కాలం నాటి శిల్పి పేరు జక్కన్న. బేలూరు చెన్నకేశవ ఆలయాన్ని చూస్తే జక్కన్న పనితనం తెలుస్తుంది. అయితే, రాజమౌళి దర్శక ధీరుడు కాకముందే ‘జక్కన్న’ అయ్యాడు. ఆ పేరు పెట్టింది మరెవ్వరో కాదు రాజీవ్ కనకాల. ‘స్టూడెంట్ నెం.1’ మూవీలో రాజమౌళి పనితీరు చూసి రాజీవ్ ఆయన్ని ‘జక్కన్న’ అని పిలిచాడు. ఇప్పుడు అంతా రాజమౌళిని అదే పేరుతో పిలుస్తున్నారు. ఆ పేరుకు తగినట్లే రాజమౌళి తన సినిమాలను మరపురాని ‘చిత్రాలు’గా మలిచారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి మరపురాని చిత్రాలను ప్రపంచానికి అందించారు. Images Credit: Rajamouli/Twitter