లంగావోణిలో అనసూయ అల్లరి, ఈ వీడియో చూశారా? అనసూయ మొన్నటి వరకు టీవీ షోస్, సినిమాలతో బిజీగా ఉంది. ఈ మధ్య టీవీ షోస్, సినిమాలు తగ్గినట్లున్నాయి. మొన్నటి వరకు అనసూయ ‘సూపర్ సింగర్ జూనియర్’కు యాంకరింగ్ చేసింది. ఇప్పుడు ‘సూపర్ సింగర్’ షో కూడా ముగిసింది. దీంతో అనసూయకు టీవీ షోస్ ఏవీ లేనట్లు తెలుస్తోంది. సినిమా ఛాన్సులు కూడా తగ్గడంతో ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అందుకే అనసూయ తన ‘యూట్యూబ్’ చానల్‌తో బిజీ అయ్యారు. తన చానల్‌తో మంచి కంటెంట్ అందించేందుకు అనసూయ తెగ కష్టపడుతోంది. ఇటీవల ‘నవస్త్ర’ కార్యక్రమంతో అనసూయ ఆకట్టుకుంది. అనసూయ తాజాగా లంగావోణితో అదరగొట్టింది. అల్లరితో సందడి చేసింది. ఆ వీడియోను ఇక్కడ చూసేయండి. Images and Videos Credit: Anasuya Bharadwaj/Instagram