'అన్‌స్టాపబుల్ 2' ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. చంద్రబాబు, లోకేష్‌తో బాలకృష్ణ చేసిన సందడి, హైలైట్స్ ఏంటో చూడండి. ఫస్ట్ హైలైట్ అంటే... చంద్రబాబు చేత చెల్లెలు భువనేశ్వరికి ఫోన్ చేయించిన బాలకృష్ణ ఐలవ్యూ చెప్పించడమే! ఎన్టీఆర్ తన ఆరాధ్య దైవమని చంద్రబాబు అన్నారు. ఆయన ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని స్పష్టం చేశారు. 'మీరు చేసిన రొమాంటిక్ పని ఏంటి?' అని బావను బాలకృష్ణ అడిగితే 'మీరు సినిమాల్లో చేశారు. నేను కాలేజీలో చేశా' అని చంద్రబాబు చెప్పారు. కాలేజీలో చదివే సమయంలో అమ్మాయిలు కనిపిస్తే సైలెన్సర్ తీసేసి బైక్ డ్రైవ్ చేసేవాళ్లమని చంద్రబాబు తెలిపారు. భార్య వసుంధరకు వంటలో సలహాలు ఇస్తానని బాలకృష్ణ చెప్పారు. భార్య మాట ఎక్కువగా వింటానని పబ్లిక్‌లో ఓకే అనడానికి తన ఇగో ఒప్పుకోవడం లేదని బాలకృష్ణ పేర్కొన్నారు. మంగళగిరిలో లోకేష్ ఓటమి గురించి ఎపిసోడ్‌లో డిస్కస్ చేసినట్లు ప్రోమోలో స్పష్టం చేశారు. రాజకీయ, కుటుంబ పరంగా 95లో తీసుకున్న నిర్ణయం గురించి బాలకృష్ణ, చంద్రబాబు మధ్య సీరియస్ డిస్కషన్ జరిగినట్టు చూపించారు. 'మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?' అని అడగ్గా... 'రాజశేఖర్ రెడ్డి, నేను బాగా తిరిగాం' అని చంద్రబాబు చెప్పారు. (All Images Courtesy : Aha YouTube)