బాలీవుడ్ లో కొన్ని సీరియల్స్ లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. ఆ తరువాత మెల్లగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంది. హిందీలో రీసెంట్ గా ఆమె నటించిన 'జెర్సీ' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఆడకపోయినా.. మృణాల్ కి మంచి పేరొచ్చింది. దీంతో ఆమెకి అవకాశాలు పెరిగాయి. తెలుగులో 'సీతారామం' అనే సినిమాలో నటించింది. దుల్కర్ హీరోగా నటించిన ఈ సినిమాలో మృణాల్.. సీత క్యారెక్టర్ లో కనిపించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో పాటు మృణాల్ కి క్రేజ్ ను తీసుకొచ్చింది. మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ వీడియో