By: ABP Desam | Updated at : 29 Mar 2023 10:32 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Allu Arjun/instagram
అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం, బన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా బన్నీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
వాస్తవానికి అల్లు అర్జున్ యానిమేటర్, డిజైనర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఆయన మొదటి వేతనం రూ.3,500 మాత్రమే. కొన్ని సినిమాల్లో బాల నటుడిగా కనిపించిన బన్నీ, 2003లో 'గంగోత్రి' చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అల్లు అర్జున్ ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరు. సందీప్ వంగా దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ఏకంగా రూ. 125 కోట్ల పారితోషకం తీసుకుంటూ, అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటుల్లో ఒకడిగా ప్లేస్ సంపాదించాడు. ఆయన రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆస్తులను భారీగానే సంపాదించారు. తన నికర విలువ, ఖరీదైన ఆస్తులు సహా ఇతర వివరాల గురించి తెలుసుకుందాం..
ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఎదుగుదల చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మూడున్నర వేల నుంచి మొదలైన ఆయన ప్రయణం ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి చేరింది. ఎండార్స్‌మెంట్స్ తో పాటు సినిమాల ద్వారా భారీగా డబ్బు అందుకుంటున్నారు. ఓ తాజా నివేదిక ప్రకారం, అల్లు అర్జున్ నికర ఆస్తుల విలువ రూ. 350 కోట్లకు పైగా ఉంది.
అల్లు అర్జున్ కు ఖరీదైన కార్లు అంటే చాలా ఇష్టం. తన గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు కొలువుదీరాయి. రేంజ్ రోవర్, హమ్మర్ H2, జాగ్వార్ XJ L, వోల్వో XC90 T8 ఎక్సలెన్స్, మెర్సిడెస్ GLE 350d, BMW X6m, ఫాల్కన్ వానిటీ వాన్ లాంటి విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ సంపాదనలో ఎక్కువ భాగం స్థిరాస్తిలో ఇన్వెస్ట్ చేశారు. ఇందులో ఇందులో విలాసవంతమైన గృహాలు, ఇతర వాణిజ్య స్థలాలు ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో వచ్చే డబ్బుతో అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని కొన్ని ప్రధానమైన రియల్ ఎస్టేట్ ఆస్తులలో పెట్టుబడులు పెట్టారు. నార్సింగిలోని అల్లు స్టూడియోస్, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ (ప్రొడక్షన్ హౌస్), ఆశీర్వాదం(ఫార్మ్ హౌస్), జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన భవనం కొనుగోలు చేశారు. మొత్తంగా అల్లు అర్జున్ సినీ ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా చెప్పుకోవచ్చు. ప్రతిభ, అంకితభావం, కృషి ఉంటే అద్భుత లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుందని నిరూపించారు.
Read Also: టాలీవుడ్‌లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ - మీ ప్రేమే కారణమంటూ ఫ్యాన్స్‌కు బన్నీ నోట్!
Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ
తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!
మే నెలలో డబ్బింగ్ సినిమాలదే హవా - ఈ మూవీస్‌కు పాజిటీవ్ రెస్పాన్స్!
Mentoo Movie: ఓటీటీలోకి ‘మెన్ టూ’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అవికా గోర్ '1920 హారర్ ఆఫ్ ది హార్ట్' ట్రైలర్ చూశారా - వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!
AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !