అన్వేషించండి

Allu Arjun: టాలీవుడ్‌లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ - మీ ప్రేమే కారణమంటూ ఫ్యాన్స్‌కు బన్నీ నోట్!

అల్లు అర్జున్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 20 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బన్నీ వెల్లడించారు. అభిమానులు, సినీ లవర్స్ ఆయనకు అభినందనలు చెప్తున్నారు.

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. అదిరిపోయే డ్యాన్సులు, అంతకు మించిన ఫైట్లతో ఆకట్టుకున్నారు. తన మార్క్ నటనతో సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ, నేటితో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 20 వసంతాలు పూర్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. “సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తయ్యాయి. అందిరి ప్రేమ, ఆదరాభిమానాలతో ముందుకు సాగుతున్నాను. నా ఎదుగుదలకు తోడ్పడుతున్న ఇండస్ట్రీ మిత్రులకు, ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆడియెన్స్ ప్రేమే కారణం” అని తెలిపారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Arjun (@alluarjunonline)

బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ

బాల నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు అల్లు అర్జున్. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో  చిరంజీవి హీరోగా నటించిన ‘విజేత’ సినిమాలో బాల నటుడిగా కనిపించారు. ఆ తర్వాత ‘స్వాతిముత్యం’ చిత్రంలోనూ నటించారు. చిరంజీవి ‘డాడీ’లోనూ నటించి మెప్పించారు. ‘గంగోత్రి’ సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అల్లు అరవింద్, అశ్వనీదత్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ‘ఆర్య’ సినిమాతో మరింతగా ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు కేరళలోనూ చాలా చోట్ల 100 రోజులు ఆడింది. ‘దేశముదురు’ సినిమాతో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అదిరిపోయే నటన కనబర్చారు. 20 ఏండ్లలో 20 సినిమాలు మాత్రమే చేశారు. ఏడాదికి ఒక సినిమా చొప్పున ఆయన నటించారు.  

పాన్ ఇండియన్ స్టార్ గా కొనసాగుతున్న బన్నీ

ఇక ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా వెలుగొందుతున్నారు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ చిత్రం. హిందీలో ఏకంగా రూ. 100 కోట్ల షేర్ సాధించి వారెవ్వా అనిపించింది.  గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘పుష్ప’ సినిమా మంచి విజయం సాధించడంతో ‘పుష్ప2’ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.   

ఇక అల్లు అర్జున్ సినిమాలతో బాగా బిజీగా ఉన్నా, కుటుంబతోనూ ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. కూతురు అర్హ, భార్య స్నేహతో కలిసి సరదాగా షికార్లు చేస్తుంటారు. బిడ్డతో కలిసి చేసే అల్లరి నిత్యం అభిమానులతో పంచుకుంటారు.

Read Also: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget