News
News
వీడియోలు ఆటలు
X

Desamuduru Re-release: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!

బన్నీ బర్త్ బర్త్ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ ‘దేశముదురు’ రీ రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్ డే ఉండగా, 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

కాన్ స్టార్ అల్లు అర్జున్ కు కెరీర్ ఓ రేంజిలో బూస్టింగ్ ఇచ్చిన సినిమా ‘దేశముదురు’. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బన్నీ కెరీర్ కు ఓ మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు. ఈ మూవీతో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు అల్లు అర్జున్. ఈ సినిమాతోనే హన్సిక మోత్వాని తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అల్లు అర్జున్ తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించి పెట్టిన సినిమా ఇదే. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీకి దివంగత సంగీత దర్శకుడు చక్రీ అదిరిపోయే సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్నీ అప్పట్లో ఓ ఊపు ఊపాయి. ప్రస్తుతం మరోసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.     

ఏప్రిల్ 7న ‘దేశముదురు’ రీరిలీజ్?

కొద్ది కాలంగా టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఆయా హీరోల బర్త్ డే సందర్భంగా, వారు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ‘దేశముదురు’ కూడా రీరిలీజ్ కు రెడీ అవుతోంది.  అయితే గత కొన్నాళ్ల నుండి హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను వారి పుట్టిన రోజు నాడు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చేనెల (ఏప్రిల్) 8న బన్నీ బర్త్ డే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త టెక్నికల్ హంగులు అద్దుతున్నట్లు సమాచారం. ఈ సినిమా రీ రిలీజ్ గురించి నిర్మాత డీవీవీ దానయ్యతో చర్చలు కొనసాగుతున్నాయట. అయితే, ఈ సినిమా విడుదల చేయాలంటే తనకు రూ. 25 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సినిమా విడుదల చేయాలని బన్నీ అభిమానులు పట్టుబడుతున్నట్లు సమాచారం.   

పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న అల్లు అర్జున్

ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ గా కొనసాగుతున్నారు. ‘పుష్ప’ సినిమాతో ఆయన రేంజి ఓ రేంజిలో పెరిగింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పుష్ప’ సినిమా విడుదలైన ప్రతి చోటా సంచలన విజయాన్ని అందుకుంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా బ్లాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం ‘పుష్ప2’ తెరకెక్కుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా ఈ ఏడాది చివరలో విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది.

‘ఆరెంజ్’ సినిమాకు భారీ స్పందన

తాజాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆరెంజ్’ సినిమా రీరిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే అన్ని సెంటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాత నాగబాబు సైతం ఈ సినిమాను అభిమానుల సమక్షంలో చూసి ఎంజాయ్ చేశారు. ఒకప్పుడు డిజాస్టర్ గా మిగిలిన ‘ఆరెంజ్’ సినిమాకు ఇప్పుడు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం పట్ల దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సంతోషం వ్యక్తం చేశారు.  

Read Also: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం

Published at : 27 Mar 2023 07:57 PM (IST) Tags: Allu Arjun desamuduru movie Desamuduru Re release

సంబంధిత కథనాలు

SPB Birth Anniversary: ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ To గిన్నిస్ వరల్డ్ రికార్డ్,  ఎస్పీ బాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

SPB Birth Anniversary: ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ To గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఎస్పీ బాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు