![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bommarillu Bhaskar: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం
ఒకప్పుడు ఫ్లాప్ అయిన సినిమా, ఇప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. చెర్రీ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన ‘ఆరెంజ్’ మూవీకి సినీ లవర్స్ నుంచి ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది.
![Bommarillu Bhaskar: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం Director Bommarillu Bhaskar Watches Ram Charan's Orange Movie In Theater With Audience Bommarillu Bhaskar: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/10eef0f2914a49b6286571392b18dfb11679919974123239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగు సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల బర్త్ డేల సందర్భంగా వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలకు సంబంధించిన సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. థియేటర్లలో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. కలెక్షన్ల పరంగా దుమ్మురేపాయి. పాత సినిమాలను కొత్త టెక్నాలజీతో డెవలప్ చేసి సినిమాలను విడుదల చేస్తున్నారు మేకర్స్. తాజాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి సినీ లవర్స్ నుంచి ఓ రేంజిలో స్పందన వస్తోంది. థియేటర్లన్నీ చెర్రీ మూవీతో సందడిగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఒకప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్
ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిన ఈ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. గా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ మూడో చిత్రంగా ‘ఆరెంజ్’ తెరకెక్కింది. ఈ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. జెనీలియా చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. 2010లో విడుదలైన ఈ సినిమాను అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు.
ఆడియెన్స్ రెస్పాన్స్ కు బొమ్మరిల్లు భాస్కర్, నాగబాబు ఫిదా
‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆరెంజ్’లో నటించారు. రిలీజ్‌కు ముందే ఈ మూవీలోని పాటలు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచాయి. పైగా ‘మగధీర’ తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తుండటంతో భారీ హైప్ ఏర్పడింది. కానీ, ఆడియన్స్ ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కావడంలో ఈ సినిమా సక్సెస్ కాలేదు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రీ రిలీజ్ ట్రెండ్ కారణంగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రీ రిలీజ్ చిత్రాన్ని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో పాటు నిర్మాత నాగబాబు థియేటర్లలో చూశారు. ప్రేక్షకులను నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి సంతోషం వ్యక్తం చేశారు. ‘లవ్ కొంతకాలమే బాగుంటుంది. జీవితాంతం ప్రేమించడం కుదరదు’ అని సినిమాలో ప్రేమ గురించి ఇచ్చే డెఫినేషన్.. 2010లో ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు. కానీ, ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు.
Then it was a flop and now it was a blockbuster.#BommarilluBhaskar @NagaBabuOffl #AnjanaProdctions @AlwaysRamCharan @geneliad @shazahnpadamsee @Jharrisjayaraj #orange #OrangeSpecialShows #RamCharan #Genelia #ShazahnPadamsee #HittuCinma pic.twitter.com/FOTctoApXS
— Hittu Cinma (@HittuCinma) March 26, 2023
NagaBabu gaaru #OrangeReRelease ,📍 Sandhya 35MM - 9PM Show#OrangeSpecialShows #OrangeReRelease #Orange4K #OrangeMovie #Orange #OrangeSongs #RamCharan𓃵 #RC #GeneliaDeshmukh #HarrisJayaraj #NagaBabu #BommarilluBhaskar #RtcXRoads pic.twitter.com/IoKdqqgeBd
— Ravi Teja Joy (@RaviTejaJoy) March 26, 2023
రీ రిలీజ్ కలెక్షన్స్ జనసేనకు విరాళం
‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్ తో వచ్చిన డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇస్తామని నాగబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు సైతం ఈ సినిమా చూసేందుకు తరలి వస్తున్నారు.
Read Also: చెర్రీకి ఎన్టీఆర్, మహేష్ బాబు శుభాకాంక్షలు, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న మెగాస్టార్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)