HBD Ram Charan: చెర్రీకి ఎన్టీఆర్, మహేష్ బాబు శుభాకాంక్షలు, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న మెగాస్టార్!
రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా స్టార్ హీరోలంతా బర్త్ డే విషెస్ చెప్తున్నారు. మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిన్ను చూసి గర్విస్తున్నా నాన్నా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 38వ పుట్టిన రోజు సందర్భంగా, ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, బంధువులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. టాలీవుడ్ లోని నటీనటులు అందరితో ఆయన ఫ్రెండ్లీగా ఉండటంతో, వరుస బెట్టి తనకు విషెస్ అందిస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు.
పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి చెర్రీ బర్త్ డే సందర్భంగా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాదు, జనాలు ఆ పుత్రుడిని పొగిడినప్పుడు పుత్రోత్సాహం కలుగుతుంది అనే మాటకు చెర్రీ, చిరంజీవి ఉదాహారణలు చెప్పుకోవచ్చు. ఆస్కార్ విజయంతో తన కొడుకును అందరూ పొగడడం చూసి మెగాస్టార్ సంతోషంలో మునిగితేలుతున్నారు. అంతేకాదు, చెర్రీ బర్త్ డే సందర్భంగా కొడుక్కు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. తనను హగ్ చేసుకుని ఉన్న ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. “ నిన్ను చూసి గర్విస్తున్నాను నాన్నా చరణ్.. పుట్టిన రోజు శుభాకాక్షలు” అంటూ ట్వీట్ చేశారు.
Proud of you Nanna.. @AlwaysRamCharan
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2023
Happy Birthday!! 🎉💐 pic.twitter.com/JnDXc50N8W
మహేష్ బాబు స్పెషల్ విషెస్
సూపర్ స్టార్ మహేష్ బాబు రామ్ చరణ్ కు స్పెషల్ విషెస్ చెప్పారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. “పుట్టిన రోజు శుభాకాంక్షలు చరణ్, మీకు మరిన్ని అద్భుతమైన బర్త్ డేలు జరుపుకోవాలని కోరుకుంటున్నను” అంటూ ట్వీట్ చేశారు.
Happy birthday, @AlwaysRamCharan! Wishing you yet another incredible year ahead!!
— Mahesh Babu (@urstrulyMahesh) March 27, 2023
జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్
‘RRR’ సినిమాతో తనతో పాటు గ్లోబర్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. “హ్యాపీ బర్త్ డే మై బ్రదర్ చరణ్, హ్యావ్ ఏ బ్లాస్ట్’ అంటూ విష్ చేశారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
Happy Birthday my brother @AlwaysRamCharan. Have a blast !!
— Jr NTR (@tarak9999) March 27, 2023
ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు
ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు ఆయన అభిమానులు. అన్ని దేశాల్లో వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ, వృద్ధులకు దుస్తుల పంపిణీ లాంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. రామ్ చరణ్ కు ఈ పుట్టిన రోజు వెరీ వెరీ స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ‘RRR’ సినిమాతో ఎన్నో విజయాలను అందుకున్నారు. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ‘RRR’ సక్సెస్ తర్వాత చరణ్‌తో సినిమా చేయడానికి బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శంకర్‌తో ‘గేమ్‌ఛేంజర్’ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమాకు ఓకే చెప్పారు.
Read Also: గ్లోబల్ స్టార్ కు సూపర్ డూపర్ విషెస్, చెర్రీకి మంచు మనోజ్ బర్త్ డే శుభాకాంక్షలు!