Ustaad Bhagat Singh First Single: 'ఉస్తాద్'లో ఫస్ట్ సాంగ్... ప్రోమో రిలీజ్ డేట్ ఫిక్స్ - పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ అప్డేట్
Pawan Kalyan UBS First Single: పవన్ కళ్యాణ్ హీరోగా కల్ట్ సినిమా గబ్బర్ సింగ్ తీసిన దర్శకుడు హరీష్ శంకర్. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' తీస్తున్నారు. అందులో ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేని సినిమా అందించిన కల్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar). పవన్ - హరీష్ కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' భారీ విజయం సాధించింది. అభిమానుల ఆకలి తీర్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). ఫ్యాన్స్ అందరికీ సినిమా నుంచి కిర్రాక్ అప్డేట్ వచ్చింది.
'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సాంగ్ రెడీ...
పాట కంటే ముందు ప్రోమో - ఎప్పుడంటే?
'గబ్బర్ సింగ్' సహా అటు పవన్ కళ్యాణ్, ఇటు హరీష్ శంకర్ సినిమాలకు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకూ ఆయన సంగీతం అందిస్తున్నారు. సూపర్ డూపర్ హిట్ కలయికలో రూపొందుతున్న ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ త్వరలో రెడీ కానుంది.
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో మొదటి పాట గురించి కొన్ని రోజుల క్రితం దేవి శ్రీ ప్రసాద్, హరీష్ శంకర్ అప్డేట్స్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేయాలనిపించే సాంగ్ ఇచ్చావని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దేవి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. హరీష్ శంకర్ అయితే ఏకంగా మేకింగ్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... డిసెంబర్ 9న అంటే మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు సాంగ్ ప్రోమో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా... దేవిశ్రీ ప్రసాద్ బాణీలో విశాల్ దడ్లాని ఆలపించారు.
Also Read: Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
View this post on Instagram
పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా...
వచ్చే ఏడాది థియేటర్లలోకి ఉస్తాద్ భగత్ సింగ్!
మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమాను తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: Akhanda 2 Postponed Effect: 'అఖండ 2' వాయిదాను క్యాష్ చేసుకున్న హిందీ సినిమా!





















