Akhanda 2 Postponed Effect: 'అఖండ 2' వాయిదాను క్యాష్ చేసుకున్న హిందీ సినిమా!
Akhanda 2 Postponed: 'అఖండ 2' వాయిదాతో తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. కొత్త సినిమాలు ఏవీ లేవు. దాంతో అర్బన్ ఏరియాల్లో ఆడియన్స్ హిందీ సినిమాకు క్యూ కట్టారు.

'అఖండ 2' (Akhanda 2 Movie) విడుదల చివరి క్షణంలో రద్దు అవుతుందని, గాడ్ ఆఫ్ మాసెస్ - నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా వాయిదా పడుతుందని ఎవరూ ఊహించలేదు. 'అఖండ' విజయం, సీక్వెల్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని మరొక సినిమాను థియేటర్లలోకి తీసుకు వచ్చే సాహసం మన తెలుగు దర్శక నిర్మాతలు చేయలేదు. అందువల్ల, 'అఖండ 2' రిలీజ్ క్యాన్సిల్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు మరొక ఆప్షన్ లేకుండా పోయింది. కొత్త తెలుగు సినిమాలు ఏవీ లేవు. దాంతో అర్బన్ ఆడియన్స్ హిందీ సినిమాకు క్యూ కట్టారు.
'అఖండ 2 వాయిదా... 'ధురంధర్'కు లాభం!
రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన తాజా హిందీ సినిమా 'ధురంధర్'. ఈ నెల 5న థియేటర్లలో విడుదలైంది. అంతా సవ్యంగా జరిగితే 'అఖండ 2' సైతం ఆ తేదీన విడుదల కావాల్సిన సినిమా. ఇప్పుడు 'అఖండ 2' లేదు. తెలుగు రాష్ట్రాల్లో పలు సింగిల్ స్క్రీన్ ఏరియాలలో 'ఆంధ్ర కింగ్ తాలూకా'ను ప్రదర్శిస్తున్నారు. ఆ సినిమాకు కొత్త రిలీజులకు వచ్చినంత రెస్పాన్స్ రావడం లేదు. అక్కడ 'అఖండ 2'ను రీప్లేస్ చేసే సినిమా లేదు. కానీ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మాత్రం 'ధురంధర్' రీప్లేస్ చేసింది.
Also Read: కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన 'ధురంధర్'... దొంగ నోట్ల పాపం వాళ్ళదేనా!?
హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, గుంటూరు వంటి నగరాల్లో మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'ధురంధర్'కు ఆదరణ బావుంది. ఆ సినిమా రన్ టైమ్ మూడున్నర గంటలు. అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో అర్బన్ ఆడియన్స్ 'ధురంధర్'ను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. 'అఖండ 2' ప్రదర్శించాల్సిన స్క్రీన్లు కూడా 'ధురంధర్'కు అలాట్ చేశారు. కలెక్షన్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో బావున్నాయి.
Also Read: Akhanda 2 Vs Veeramallu: అఖండ 2 vs వీరమల్లు... బాలయ్య vs పవన్... ఎందుకీ రచ్చ? ఏమిటీ డిస్కషన్??
View this post on Instagram
రణవీర్ సింగ్ 'ధురంధర్'కు హిందీ ఆడియన్స్ నుంచి విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఉత్తరాది ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. భారత దేశంపై వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదంపై తీసిన సినిమా కావడం వల్ల దేశభక్తులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. 'ధురంధర్ 2' వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు





















