అన్వేషించండి

Oscars 2024 RRR Stunts: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్స్ స్వీట్ సర్‌ప్రైజ్ - పాటే కాదు, స్టేజిపై ఎన్టీఆర్, చరణ్ స్టంట్స్‌ కూడా!

Oscar Awards 2024: ఆస్కార్స్... ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 'ఆర్ఆర్ఆర్'కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. మన స్టంట్ సీక్వెన్సులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.

RRR has been recognized as one of the world's greatest stunt movies by the Oscar Awards 2024: ఆస్కార్స్ 2024 వేడుక 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చిత్ర బృందానికి డబుల్ ధమాకా అందించింది. లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్, అమెరికాలో జరిగిన 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్' (The Academy Awards 2024) 96వ అవార్డుల వేడుకలో రెండుసార్లు స్టేజి మీద 'ఆర్ఆర్ఆర్' విజువల్స్ ప్రదర్శించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

స్టంట్స్ గురించి ప్రస్తావించినప్పుడు...
RRR team surprised by Oscars 2024 sweet gesture: 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు...' పాటకు గత ఏడాది ఆస్కార్ వచ్చిన విషయం అందరికీ తెలుసు. 'ఆర్ఆర్ఆర్' అంటే ఆ పాట ఒక్కటే కాదు... కథ, కథలో ఎమోషన్, ఆ ఎమోషన్ నుంచి వచ్చిన యాక్షన్ / స్టంట్ సీక్వెన్సులు కూడా! ముఖ్యంగా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన స్టంట్స్ భాషలకు అతీతంగా ప్రేక్షకుల్ని ఎంత గానో అలరించాయి. ఇప్పుడు ఆ స్టంట్స్ (RRR Stunts recognized by Oscars 2024)కు అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్స్ మరోసారి గుర్తింపు తెచ్చింది.

సినిమా కోసం జీవితాలను పణంగా పెట్టేది స్టంట్ కమ్యూనిటీ అంటూ ఆస్కార్స్ స్టేజి మీద స్టంట్ మాన్ గొప్పతనాన్ని వివరించారు. ప్రపంచంలో ది బెస్ట్, గ్రేటెస్ట్ స్టంట్స్ కొన్నిటిని ప్రదర్శించారు. అందులో 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన స్టంట్ సీక్వెన్సుకు చోటు కల్పించారు. ఈ స్వీట్ సర్‌ప్రైజ్ ఊహించని 'ఆర్ఆర్ఆర్' టీమ్ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ ఆస్కార్స్ వేడుకలో స్టేజి మీద 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' సాంగ్ విజువల్స్ కూడా ప్లే చేశారు. ఇది 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందానికి డబుల్ డిలైట్ అని చెప్పాలి. 

ఆస్కార్స్ 2024లో 'నాటు నాటు...' సాంగ్ ఎందుకు ప్లే చేశారో తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి: మళ్లీ ఆస్కార్స్ స్టేజిపై నాటు నాటు - ఇండియన్స్‌ కు మరోసారి ప్రైడ్ మూమెంట్!

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాలోనూ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అయ్యాయి. 'స్టూడెంట్ నంబర్ 1' నుంచి మొదలు పెడితే 'ఆర్ఆర్ఆర్' వరకు ప్రతి సినిమాలోనూ స్టంట్ / యాక్షన్ సన్నివేశాలపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించబోయే తదుపరి సినిమా మీద మరింత శ్రద్ధ వహిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Also Readక్రిస్టోఫర్ నోలన్‌కు ఫస్ట్ ఆస్కార్, ఏడు అవార్డులతో సత్తా చాటిన 'ఓపెన్ హైమర్' - 2024లో విజేతలు వీరే
 
మహేష్ బాబు హీరోగా గ్లోబ్ ట్రాంటింగ్ జానర్ మూవీ తీయాలని రాజమౌళి ప్లాన్ చేశారు. కథా నేపథ్యం దేశ, విదేశాల్లో ఉంటుంది. అందువల్ల, రాజమౌళికి స్టంట్స్ మరింత వైవిధ్యంగా రూపొందించే అవకాశం ఉంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget