ఈ సినిమాకి అసలు హీరో నేను కాదు: నిఖిల్ సిద్ధార్థ్
నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన 'స్పై' సినిమాకు సంబంధించి తాజాగా ప్రెస్ మీట్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో హీరో నిఖిల్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం డిఫరెంట్ జోనర్ మూవీస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. గత ఏడాది ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’ వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న నిఖిల్.. ఇప్పుడు 'స్పై' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎడిటర్ గ్యారీ బి.హెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమాని జూన్ 29న తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ ని నిర్వహించగా.. ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
ఇక కాసేపటి క్రితమే మూవీ యూనిట్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. "ఎన్ని హిట్లు వచ్చినా ఎంత సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా, ప్రతి సినిమా మళ్లీ కొత్త జర్నీనే. కొత్తగా మొదలు పెట్టాల్సిందే. అలా కొత్తగా ట్రై చేసిన మూవీనే 'స్పై'. ఇది ఒక కంప్లీట్ స్పై యాక్షన్ థ్రిల్లర్. సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి తెలియని కొన్ని విషయాలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అని అన్నారు. ఈ సినిమాకి నేను హీరో కాదు. ఈ సినిమాకి కథ మెయిన్ హీరో. ఈ సినిమానే కాదు ఏ సినిమాకైనా స్టోరీనే మెయిన్ హీరో. ఇక ఇటీవల కాలంలో ఆడియన్స్ కంటెంట్ ఉంటేనే ఆ సినిమాలను ఆదరిస్తున్నారు. ఆ తర్వాత సినిమాలో హీరో బాగా చేశాడని, లేదా హీరోయిన్, ఆర్టిస్టులు బాగా చేశారని చెప్పుకుంటున్నారు.
‘‘ఈ సినిమాని నేను ఒప్పుకోవడానికి మెయిన్ కారణం రాజశేఖర్ రెడ్డి గారు. ఈ కథ నాకు వినిపించినప్పుడు కథ విని చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను. అలాగే దర్శకుడు గ్యారీ ఓ మంచి పాయింట్ తో వస్తున్నారు. ఇక నిన్న మేము నేతాజీ గారి విగ్రహం దగ్గర టీజర్ ని లాంచ్ చేయడానికి కారణం ఈ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసాం. నిన్న రిలీజ్ చేసిన టీజర్ కు ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ చూసి మా మూవీ టీమ్ అంతా ఎంతో హ్యాపీగా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పను. కానీ, సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఓ మంచి సినిమా చూసామనే ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది. ప్రతి ఒక్కరూ మా సినిమాని సపోర్ట్ చేయండి. మీడియా వారు కూడా మా సినిమాని ప్రమోట్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు" అంటూ చెప్పుకొచ్చాడు.
ED ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించడంతోపాటు స్టోరీ కూడా అందిస్తున్నారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆర్యన్ రాజేష్, మకరంద దేశ్ పాండే, అభినవ్ గోమటం, రవి వర్మ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Also Read : గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ కథతో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'?