News
News
వీడియోలు ఆటలు
X

Adikesava Vs Gali Janardhan Reddy : గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ కథతో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'?

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఆదికేశవ' గ్లింప్స్ విడుదలైంది. అందులో చూపించిన కథ కొందరికి గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ గుడిని గుర్తు చేసింది.

FOLLOW US: 
Share:

'ఇంత తవ్వేశారు! ఆ గుడి జోలికి మాత్రం రాకండయ్యా!' - 'ఆదికేశవ' ఫస్ట్ గ్లింప్స్ (Aadikeshava First Glimpse) ప్రారంభంలో వినిపించిన డైలాగ్! ఆ మాట వినిపించే సమయంలో స్క్రీన్ మీద చూస్తే... గుడి వెనుక అంతా తవ్వేసిన దృశ్యం! గుడిలో శివ లింగానికి హారతి ఇస్తున్న పూజారి! ఆ తర్వాత దృశ్యాలు చూస్తే... కథ ఏమిటి? అనేది చాలా క్లారిటీగా అర్థం అయిపోతుంది.

గుడికి రక్షకుడిగా రుద్ర కాళేశ్వర్
'ఆదికేశవ' సినిమాలో కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ పేరు రుద్ర కాళేశ్వర్ రెడ్డి. మైనింగ్ చేసే కొందరు గుడి వెనుక భాగం అంతా తవ్వేస్తారు. ఆ తర్వాత గుడిని కూడా తవ్వేయాలని వస్తారు. అప్పుడు వాళ్ళను హీరో ఎలా అడ్డుకున్నాడు? ఆ గుడికి రక్షకుడిగా ఎలా నిలబడ్డాడు? అనేది కథాంశంగా తెలుస్తోంది. అయితే, ఈ స్టోరీ లైన్ చాలా మందికి గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ ఇష్యూను గుర్తు చేస్తోంది. 

గాలి జనార్ధన్ రెడ్డి ఎందుకు వచ్చారు?
ఇప్పుడు అంటే గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhan Reddy) పేరు వినబడటం లేదు గానీ... ఒక సమయంలో ఆయన కేంద్ర బిందువుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాజకీయాలు సాగాయి. గాలి జనార్ధన్ రెడ్డికి మైనింగ్ కింగ్ అని, మైనింగ్ మాఫియా అని కొందరు పేర్లు పెట్టారు. 

ఏపీలో గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ వ్యాపారం కొన్నేళ్ళు మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు సాగింది. అయితే, ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని సుంకులమ్మ గుడిని పగలకొట్టారు. ఆ గుడి జోలికి వెళ్లిన తర్వాత ఆయన పతనం ప్రారంభమైందని చెబుతారు. సుంకులమ్మ గుడి వల్లే తనకు ఈ గతి పట్టిందని ఒక ఇంటర్వ్యూలో గాలి జనార్ధన్ రెడ్డి సైతం వ్యాఖ్యానించారు. 

'ఆదికేశవ' సినిమా ఫస్ట్ గ్లింప్స్ చూసిన తర్వాత... మైనింగ్ ఏరియాలో ఉన్న గుడిని కూల్చడం నేపథ్యంలో కథ కావడంతో చాలా మందికి గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ గుడి వివాదం గుర్తుకు వచ్చింది. సినిమా విడుదలైతే తప్ప అది నిజమా? కాదా? అనేది తెలియదు. అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్!  రానా దగ్గుబాటి హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రానికీ గాలి జనార్ధన్ రెడ్డి స్ఫూర్తి అని తెలుగు చిత్రసీమలో కొందరి కథనం. 

Also Read : మహేష్, త్రివిక్రమ్ టైటిల్ రేసులో కొత్త పేరు - 'ఊరికి మొనగాడు'?

వైష్ణవ్ తేజ్ జోడీగా శ్రీ లీల
'ఆదికేశవ' సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా యువ కథానాయిక శ్రీ లీల నటించారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. సూర్యదేవర నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మాతలు.
 
'ఆదికేశవ' సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఈ సినిమాతో వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్, ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ తెలుగు చిత్రసీమలోకి అడుగు పెడుతున్నారు. జోజు జార్జ్ విలన్ రోల్ చేశారు. జూలైలో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రానున్నారు. 

Also Read : దీపావళికి 'జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌' - ఇది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్!

Published at : 16 May 2023 09:49 AM (IST) Tags: Panja Vaisshnav Tej Gali Janardhan Reddy Sreeleela Adikeshava First Glimpse Adikeshava Teaser Review Sunkulamma Temple

సంబంధిత కథనాలు

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - గెలుపు టీమిండియాదేనోయ్ - ఫ్యాన్స్‌కు ‘లెఫ్ట్’ సెంటిమెంట్

WTC Final 2023: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - గెలుపు టీమిండియాదేనోయ్ - ఫ్యాన్స్‌కు ‘లెఫ్ట్’ సెంటిమెంట్