అన్వేషించండి

Manchu Vishnu: యాక్షన్‌ను మిస్ అవుతున్నాను - ‘కన్నప్ప’ నుంచి మంచు విష్ణు మరో అప్డేట్, అక్షయ్‌తో షూటింగ్ అప్పుడే అయిపోయిందా?

Kannappa Movie: భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ నుండి మంచు విష్ణు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా అక్షయ్ కుమార్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ మరో అప్డేట్ ఇచ్చాడు.

Kannappa Movie Update: ప్రతీ సినీ సెలబ్రిటీకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం వాళ్లు ఎంత రిస్క్ తీసుకోవడానికి అయినా సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కోసం మంచు విష్ణు.. అలాంటి రిస్కులే తీసుకుంటున్నాడు. ముఖ్యంగా క్యాస్టింగ్ విషయంలో ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు విష్ణు. కేవలం సౌత్ ఇండస్ట్రీ నుండే కాదు.. బాలీవుడ్ నుంచి కూడా స్టార్లను ‘కన్నప్ప’ కోసం రంగంలోకి దించుతున్నాడు ఈ హీరో. తాజాగా బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ కూడా ‘కన్నప్ప’లో తనవంతు షూటింగ్ పూర్తి చేసుకోవడంతో మంచు విష్ణు ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశాడు.

నేర్చుకున్నాను.. నవ్వుకున్నాను..

‘అక్షయ్ కుమార్‌తో షూటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. ఎన్నో నేర్చుకున్నాను. ఎంతో నవ్వుకున్నాను. ఇప్పుడు యాక్షన్‌ను మిస్ అవుతున్నాను. మరెన్నో కలయికల కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ అక్షయ్ కుమార్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు మంచు విష్ణు. టాలీవుడ్ రేంజ్ మారిపోయిన తర్వాత ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలు.. తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అక్షయ్ కుమార్‌కు కూడా తెలుగు సినిమాలు, తెలుగు మేకర్స్ అంటే చాలా ఇష్టమని పలుమార్లు బయటపెట్టారు. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’తో టాలీవుడ్ డెబ్యూకు సిద్ధమయ్యాడు అక్షయ్ కుమార్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

వేగంగా షూటింగ్..

‘కన్నప్ప’లో అక్షయ్ కుమార్ ఏ పాత్రలో కనిపించనున్నాడు అనే విషయం ఇంకా రివీల్ చేయలేదు మేకర్స్. ఏప్రిల్ నెలలోనే అక్షయ్ కుమార్‌తో కలిసి ‘కన్నప్ప’ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్టుగా అప్డేట్ ఇచ్చాడు విష్ణు. ఇక ఇంతలోనే  షూటింగ్ పూర్తయ్యిందంటూ మరో అప్డేట్‌ను బయటపెట్టాడు. దీంతో ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా సాగుతుందని అర్థమవుతోంది. అయినా ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. కేవలం క్యాస్టింగ్ వివరాలతోనే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు మంచు విష్ణు. ‘కన్నప్ప’లో గెస్ట్ రోల్స్ చేస్తున్న నటీనటుల లిస్ట్ చాలా పెద్దగానే ఉందని ఆడియన్స్ ఫీలవుతున్నారు.

త్వరలోనే ప్రభాస్ కూడా..

మంచు విష్ణు అప్‌కమింగ్  మూవీ ‘కన్నప్ప’లో ప్రభాస్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడనే విషయం ఇప్పటికే బయటికొచ్చింది. ఈ విషయంపై విష్ణు కూడా పలుమార్లు హింట్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్ కూడా త్వరలోనే ‘కన్నప్ప’ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మే చివరిలోపు ‘కన్నప్ప’ కోసం ప్రభాస్ సిద్ధమవుతాడట. కన్నప్ప.. ఒక శివభక్తుడు. అలాంటి గొప్ప శివభక్తుడిపై తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి ఇందులో శివుడి పాత్రలో నటించే యాక్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండాలని, అందుకే ప్రభాస్‌ను సెలక్ట్ చేసుకున్నారని అర్ధమవుతోంది.

Also Read: ‘పుష్ప.. పుష్ప’ సాంగ్ - బన్నీచేతిలోని గ్లాస్ నుంచి టీ ఎందుకు ఒలకలేదో తెలుసా? కారణం ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Deed Body Parcel Case Update: ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
Embed widget