అన్వేషించండి

Pushpa Pushpa Song: ‘పుష్ప.. పుష్ప’ సాంగ్ - బన్నీచేతిలోని గ్లాస్ నుంచి టీ ఎందుకు ఒలకలేదో తెలుసా? కారణం ఇదే!

Pushpa Pushpa Song: ‘పుష్ప ది రూల్’ నుంచి విడుదలయిన ‘పుష్ప పుష్ప’ సాంగ్.. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్లే లిస్ట్‌ను రూల్ చేస్తోంది. ఇందులో బన్నీ చేసిన గ్లాస్ స్టెప్ వెనుక ఒక లాజిక్ ఉంది.

Pushpa Pushpa Song Glass Step: ప్రస్తుతం తెలుగు నుంచి చాలా పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి ‘పుష్ప ది రూల్’. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ‘పుష్ప 2’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలయిన ‘పుష్ప పుష్ప’ పాట ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే ఈ పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులను అప్పుడే నెటిజన్లు ఇమిటేట్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా అందులోని ఛాయ్ స్టెప్ గురించే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అసలు ఆ ఛాయ్ స్టెప్ వేస్తున్నప్పుడు కప్‌లో నుంచి ఛాయ్ ఎందుకు ఒలకలేదు అనేదాని వెనుక ఒక పెద్ద థియరీ ఉంది.

అదే కారణం..

‘పుష్ప 2’ నుంచి తాజాగా ‘పుష్ప పుష్ప’ అనే పాట విడుదలయ్యింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి అల్లు అర్జున్ స్టెప్పులు వేయడం ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌ను అందించింది. అయితే అందులో గ్లాసులో టీ పోసుకొని అల్లు అర్జున్ రౌండ్‌గా తిప్పినా.. టీ ఒలకలేదు. దానికి కారణం సెంట్రల్ ఫోర్స్. సెంట్రల్ ఫోర్స్ వల్ల ఇది సాధ్యమవుతుంది. కప్పును వేగంగా తిప్పినప్పుడు.. అందులో ఉండే ద్రవపదార్థంపై సెంట్రల్ ఫోర్స్ ప్రభావం పడుతుంది. దానివల్ల అది కిందకు ఒలకకుండా స్థిరంగా ఉంటుంది. అదే కప్పును నెమ్మదిగా తిప్పితే.. టీ ఒలికిపోతుంది. అది మనం తిప్పే వేగంపై ఆధారపడి ఉంటుంది. ఈ పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పును శ్రద్ధగా గమనిస్తే.. తను కప్‌ను చాలా వేగంగా తిప్పాడు. అందుకే టీ ఒలకలేదు. చాలామంది దీన్ని గ్రాఫిక్స్ అంటున్నారు. అయితే, దీన్ని చేయడానికి గ్రాఫిక్స్‌తో పనిలేదు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Arjun (@alluarjunonline)

ప్రశంసలు మొదలు..

‘పుష్ప పుష్ప’ పాటలో అల్లు అర్జున్ వేసిన చాలా స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది లిరికల్ వీడియోనే అయినా ఇందులో చూపించిన బన్నీ ప్రతీ స్టెప్పును ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఫ్యాన్స్. అందుకే రెండు రోజులుగా సోషల్ మీడియాలో మొత్తం ‘పుష్ప పుష్ప’ మ్యానియానే కనిపిస్తోంది. ముందుగా ఈ సాంగ్ గ్లింప్స్ విడుదలయినప్పుడు దీనిని ట్రోల్ చేసిన ప్రేక్షకులే.. ఇప్పుడు దీనిని లూప్‌లో వింటున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా బాగుందంటూ ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. మొత్తానికి ‘పుష్ప’ పార్ట్ 1 లాగానే పార్ట్ 2 పాటలు కూడా మెల్లగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటను యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే సుమారు 40 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ రావడం గమనార్హం. ఒక లిరికల్ సాంగ్‌కు ఇన్ని వ్యూస్ రావడం ఆల్ టైమ్ రికార్డ్ అని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

హిస్టరీ రిపీట్..

‘పుష్ప పుష్ప’ పాటలో ఛాయ్ స్టెప్‌తో పాటు షూ స్టెప్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ‘పుష్ప ది రైజ్’లోని శ్రీవల్లి పాటలో కూడా ఇలాగే చెప్పుతో సింపుల్‌గా ఒక స్టెప్ వేసి పాటను ఇంటర్నేషనల్ రేంజ్‌కు తీసుకెళ్లాడు అల్లు అర్జున్. ఇప్పుడు ‘పుష్ప పుష్ప’తో కూడా అదే రిపీట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఛాయ్ స్టెప్‌తో పాటు ఈ షూ స్టెప్‌ను కూడా ఇమిటేట్ చేస్తూ రీల్స్, షార్ట్స్ చేస్తున్నారు నెటిజన్లు. చాలామంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా అల్లు అర్జున్ వేసిన స్టెప్పులను ఇమిటేట్ చేస్తూ లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు.

Also Read: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న జ్యోతిక, అజయ్ దేవగన్ ‘సైతాన్’ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్క‌డ‌?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget