Image Source: pexels

క్యాబేజీ జ్యూస్ తాగితే పొట్ట తగ్గుతుందా?

క్యాబేజీ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుత‌మైన ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో చూసేయండి.

క్యాబేజీలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

క్యాబేజీలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడటంతోపాటు గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

క్యాబేజీ జ్యూసులో గ్లూకోసినోలేట్స్, ఆంథోసైనిన్స్.. గుండె జబ్బులు, క్యాన్సర్‌లకు చెక్ పెడతాయి.

బరువు తగ్గాలనుకునేవారు క్యాబేజీ జ్యూస్ తాగాలి. తక్కువ కేలరీలు ఉండటంతో బరువు ఈజీగా తగ్గుతారు.

ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా దోహదంచేస్తుంది.

క్యాబేజీ రసంలో ఉండే సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

క్యాబేజీ రసం రెగ్యులర్ గా తాగితే కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

ఇందులో ఉండే విటమిన్ సి.. రోగనిరోధక పనితీరుకు మేలు చేస్తుంది. అంటువ్యాధుల నుంచి కాపాడుతుంది.

Image Source: pexels

క్యాబేజీ జ్యూసులో విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బోలు ఎముకల వ్యాధి, ఎముకల పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.