ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగితే విటమిన్ C తో పాటు యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. టాక్సిన్లు బయటికి పోతాయి. కాటచిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కలిగిన గ్రీన్ టీ లివర్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. లివర్ పనితీరు మెరుగు పరుస్తుంది. బీటైన్, యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు కలిగిన బీట్ రూట్ రసం లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బైల్ ఉత్పత్తిని పెంచుతుంది. పాలలో పసుపు కలిపి తీసకుంటే పసుపులో ఉండే కర్క్యూమిన్ శక్తమంతమైన యాంటీఆక్సిడెంట్ వల్ల లివర్ ను ఆక్సిడెటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. నిమ్మకాయ నీళ్లలో కొద్దిగా అల్లం కలిపి తాగితే శరీరం సహజంగా డీటాక్స్ అవుతుంది. అల్లం వల్ల లివర్ శుభ్రపడుతుంది. నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె కలిపి తీసుకుంటే ఫ్యాట్ బర్న్ అవుతుంది. లివర్ కూడా శుభ్రపడుతుంది. కీరదోస, పుదీనా నీటిలో వేసి ఆనీటిని తాగడం వల్ల శరరీం హైడ్రేటింగ్ గా ఉంటుంది. శరీరం నుంచి విషపదార్థాలు విసర్జితం అవుతాయి. బీటాకెరోటిన్, ఇతర యాంటీఆక్సిడెంట్స్ కలిగిన క్యారెట్ జ్యూస్ లో కొద్దిగా అల్లం కలిపి తాగితే లివర్ ఆరోగ్యానికి మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే