వేసవిలో వేడి, విపరీతమైన హుమిడిటి, ఉక్కపోత నడుమ పిల్లలు నీరసించి పోతారు. వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వేసవి వేడి నుంచి పిల్లలను కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

పిల్లలు తగినన్ని నీళ్లు తాగేలా చూడాలి. నీళ్ల బాటిల్ వారికి ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంచాలి. తరచుగా నీళ్లు తాగాలని గుర్తుచెయ్యాలి.

ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు వాడాలి. ఇది పిల్లలను నేరుగా ఎండ తాకకుండా కాపాడుతుంది.

వీలైనంత వరకు ఎండ సమయాల్లో బయటికి వెళ్లకుండా చూసుకోవాలి.

సింపుల్ గా, వదులుగా ఉండే, లేత రంగుల కాటన్ దుస్తులు మాత్రమే పిల్లలకు వాడాలి.

బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ వాడాలి. ముఖ్యంగా స్విమ్మింగ్ వంటి ఆటల్లో ఉన్నపుడు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే