Image Source: pexels

ఈ సందర్బాల్లో అస్సలు పళ్లు తోమకూడదట

మనం ఎప్పుడు బ్రష్ చేయాలో కాదు.. ఎప్పుడు బ్రెష్ చేసుకోవద్దో కూడా తెలుసుకోవాలి.

కొన్ని సందర్బాల్లో బ్రష్ చేయడం అంత మంచిది కాదని దంత వైద్యులు చెబుతున్నారు. అవే సందర్భాల్లో చూద్దాం.

భోజనం చేసిన వెంటనే బ్రష్ చేయకూడదు. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత మన నోరు ఎసిడిట్ గా మారుతుంది.

ఎసిడిటి అనేది మన పళ్ల మీద ఉండే ఎనామిల్ ను బలహీన పరుస్తుంది. డిమైనరలైజేషన్.. దంతక్షయానికి కారణం అవుతుంది.

భోజనం చేసిన తర్వాత బ్రష్ చేయాలంటే కనీసం 30 నుంచి 60 నిమిషాల వరకు వేచి ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

వాంతులు చేసిన వెంటనే బ్రష్ చేయకూడదు. వాంతులు చేసినప్పుడు పొట్టలోని యాసిడ్స్ నోట్లోకి వస్తాయి.

ఈ యాసిడ్స్ పళ్ల మీద ఉండే ఎనామిల్ ను బలహీనపరుస్తాయి. వాంతులు చేసిన 30 నిమిషాల తర్వాత బ్రష్ చేయాలి

Image Source: pexels

కాఫీ, టీ తాగిన వెంటనే కూడా బ్రష్ చేయకూడదు. కాఫీ తాగిన 30 నిమిషాల తర్వాత బ్రష్ చేయాలి.