వేసవి వేడి చాలా ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడూ చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తుంది.

సాఫ్ట్ డ్రింక్స్ తాగడం అంత మంచిదికాదు. ఆరోగ్యాన్నిచ్చే దేశీ పానీయాల గురించి తెలుసుకుందాం.

మజ్జిగ - ఉప్పు, కొద్దిగా మజ్జిగ మసాల కలిపి తీసుకుంటే రుచికి రుచి చల్లదనానికి చల్లదనం.

వెలగపండు గుజ్జుతో చేసే డ్రింక్ ను బెల్ షర్బత్ అంటారు. ఇది రోజంతా మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

నిమ్మకాయ నీళ్లు తాగితే శరీరం నుంచి టాక్సిన్లు తొలగిపోతాయి. చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

పచ్చి మామిడి ఉడికించి గుజ్జుతో చేసే షర్బత్ రుచిగా ఉండడమే కాదు. చలువ చేస్తుంది.

శికంజి అనేది నార్త్ ఇండియన్ నిమ్మకాయ షర్బత్. ఇది కూడా తాజా ఫీల్ ఇస్తుంది. శరీరం హైడ్రేటింగ్ గా ఉంటుంది.

తియ్యని చిక్కని పెరుగుతో చేసే లస్సీ రుచిగా ఉంటుంది. కడుపు నిండుగా, చల్లగా ఉంచుతుంది. దీనితో శరీరం హైడ్రేటింగ్ గా ఉంటుంది.

కొబ్బరి నీళ్లలో చాలా ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. చెమట వల్ల కోల్పోయిన ఎలక్ట్రోలైట్లు తిరిగి శరీరానికి అందుతాయి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.