వేసవిలో పెరటి మొక్కలను కాపాడేందుకు ఈ టిప్స్ పాటించండి వేసవిలో ఇంట్లో పెరిగే మొక్కలను కూడా సురక్షితంగా కాపాడాలి. అప్పుడే అవి ఎండిపోకుండా తాజాగా ఉంటాయి. ప్రత్యక్ష సూర్యకాంతి ఆకులపై పడకుండా మొక్కల కుండీలను మార్చండి. మొక్క నేలలో తేమ స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేయండి. వేసవిలో నీటి అవసరాలను ఎప్పటికప్పుడు చూస్తుండాలి. ప్రతివారం ఆకులను శుభ్రం చేయండి. స్మూత్ గా, తడిగా ఉన్న వస్త్రాన్ని ఆకులను తుడిచేందుకు ఉపయోగించండి. మొక్కలను ఉదయం నీరు అందించాలి. ఎండవేడిమికి తట్టుకోవాలంటే ఉదయమే నీరు పోయడం ముఖ్యం. మీ బాల్కనీలోకి ఎండవేడిమి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో..మొక్కలకు ప్రత్యక్ష సూర్యకాంతి పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. మల్చింగ్ చల్లటి నేలలో మీ మొక్కలను రక్షించడమే కాకుండా, తేలికపాటి కవరేజీని అందిస్తే ప్రయోజనకంగా ఉంటుంది. మొక్కలకు అవసరమైన కంటైనర్లను ఉపయోగించండి. పోషకాలు, రూట్ కు అందిస్తాయి.