మీరు బ్లూ రైస్ ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో ఇలా చెయ్యాలి బ్లూరైస్ ను శంకుపువ్వులతో తయారు చేస్తారు. ఈ రైస్ తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. శంకుపువ్వుల్లోని ఆంథోసైనిన్ వంటి ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రైస్ కు మంచి రంగును అందిస్తాయి. సహజరంగులో ఉండే నీలిరంగు బియ్యం ఆరోగ్యానికి మంచిది. శంకుపువ్వు ఔషధ గుణాలకు ప్రసిద్ధి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ ప్రభావాలు ఉన్నాయి. ఈ రెసిపీలో నెయ్యి, విటమిన్లు ఎ, ఇ, డితో నిండి ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. పోషకాల శోషణను పెంచుతుంది. బాస్మతి బియ్యం,జీడిపప్పు, ఎండు ద్రాక్షలతో ఈ రెసిపీ తయారు చేస్తే ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా అందుతాయి. బాస్మతి బియ్యంతో శంకుపువ్వులను ఉడకబెట్టడం వల్ల సహజమైన నీలి రంగు అందిస్తుంది. రకరకాల రుచులను కోరుకునే ఆహార ప్రియులు బ్లూరైస్ రెసిపీ ఎంతో ఇష్టంగా తింటుంటారు.