ఎప్పుడైనా చాయ్‌లో ఉప్పేసుకుని తాగారా? సినిమాల్లో కామెడిగా చూడడం తప్ప!

నిజమే మీరు కరెక్ట్ గానే చదివారు. చాయ్ లో ఉప్పేసుకుని తాగితే చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

టీ డికాక్షన్ లో ఒక రకమైన చెదు ఉంటుంది. ఉప్పేసినపుడు అది బ్యాలెన్స్ అవుతుంది. కనుక తాగడం సులభం అవుతుంది.

అన్ని పదార్థాలకు ఉప్పు రుచిని ఇచ్చినట్లే టీకి కూడా ఇస్తుంది. టీ సహజమైన రుచి మనకు అర్థం అవుతుంది.

టీలో ఉండే ఆస్ట్రింజెంట్ రుచిని ఉప్పు తేలిక చేస్తుంది. అందువల్ల తాగేందుకు అనువుగా మారుతుంది.

ఉప్పు జీర్ణక్రియకు తోడ్పడే లాలాజల ఉత్పత్తికి దోహదం చేస్తుంది.

ఒక చిటికెడు ఉప్పు చేర్చితే టీలో ఎలక్ట్రోలైట్స్ చేరుతాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. వేసవిలో ఉప్పు టీ మేలు చేస్తుంది.

ఒక చిటికెడు ఉప్పు బీపి పెరిగేందుకు పెద్దగా కారణం కాదు. ఒక్కోసారి బీపి సంతులన పరిచేందుకు కూడా దోహదం చేస్తుంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహా తర్వాతే పాటించండి.