Image Source: pexels

నోరూరించే ఎగ్ రోల్ - బ్రేక్‌ఫాస్ట్ ఇదే మంచి ఆప్షన్, ఇలా తయారు చెయ్యండి

ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ కావాలా? ఈ ఎగ్ రోల్ రెసిపీని ట్రై చెయ్యండి.

ఎగ్ రోల్ రెసిపీ కోసం 4 గుడ్లు, గోధుమపిండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పొట్టు తీసిన దోసకాయ.

2 టేబుల్ స్పూన్ల వెనిగర్, ఉల్లిపాయ ముక్కలు, రుచికి ఉప్పు, చాట్ మసాలా, 2 టీస్పూన్ల రెడ్ చిల్లీ సాస్.

గిన్నెలో పచ్చిమిర్చి, వెనిగర్ వేసి పక్కన పెట్టుకోవాలి.

కొద్దిగా పిండిని తీసుకుని పెద్దరోటీలా రోల్ చేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చాలి.

ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన, ఉప్పు, పిండి వేసి పిసకండి. నాన్ స్టిక్ తవాను వేడి చేసి దానిపై కొన్ని చుక్కల నూనె పోసి టిష్యూ పేపర్ తో తుడవండి.

దానిపై ఈ పిండిని పోసి పైన రోటీ ఉంచండి. దానిపై మిగిలిపోయిన గుడ్డులోని తెల్లసొనను పోసి తిప్పుతూ కాల్చండి.

ఉడికిన రోటీలో కొద్దిగా చాట్ మసాలా, దోసకాయ, చిల్లీసాస్, కెచప్, చిల్లీ వెనిగర్ తోపాటు ఉల్లిపాయను వేసి గట్టిగా రోల్ చేయండి.

Image Source: pexels

అంతే.. రుచికరమైన ఎగ్ రోల్ రెడీ. దీన్ని మీ పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు.