రక్త ప్రసరణ ద్వారానే ఆక్సిజన్, పోషకాలు అన్నీ కూడా శరీర భాగాలకు అందుతాయి.

రక్తప్రసరణ సరిగ్గా లేనపుడు చేతులు, కాళ్ల వేళ్ల కొనలు నల్లబడుతాయి. నీరసం, అలసట ఆవహిస్తాయి.

రక్తప్రసరణ సరిగ్గా జరిగేందుకు దోహదం చేసే కొన్ని వ్యాయామాల గురించి తెలుసుకుందాం.

రక్తప్రసరణలో ఇబ్బందులుల మధుమేహం, స్థూలకాయం, బీపీ, పొగతాగే అలవాటు ఇలా రకరకాల కారణాలతో రావచ్చు.

కాళ్లు కొద్దిగా వెడల్పుగా పెట్టి నిలబడి తర్వాత నెమ్మదిగా కిందకి వంగి చేతులు కాళ్ల మీద నిలబడి నెమ్మదిగా నడుము పైకి లేపాలి.

ఈ భంగిమ పర్వతం మాదిరిగా కనిపిస్తుంది. కనుక దీన్ని పర్వతాసనం అంటారు.

రోజూ అరగంట పాటు సైకిలింగ్ చెయ్యడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

గోడకు దగ్గరగా పడుకొని కాళ్లు గోడ సపోర్ట్ తో ఎత్తిపెట్టి ఉంచాలి. ఇలా రోజుకు10 నిమిషాలు చేస్తే రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

ప్రతిరోజూ 20-30 నిమిషాలపాటు వాకింగ్ చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యం బావుంటుంది. బరువు తగ్గొచ్చు.

ఎంజాయ్ చేస్తూ రక్తప్రసరణ మెరుగుపరుచుకునే మంచి మార్గం డాన్స్ చెయ్యడం. జుంబా, సాల్సా, బాల్ రూమ్ వంటి డాన్స్ లు ఎంచుకోవచ్చు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే