ఇండియాలో అల్టిమేట్ రొమాంటిక్ డెస్టినేషన్స్ ఇవే ఉదయ్ పూర్: ఇక్కడి అందమైన సరస్సులు మనసు దోచేస్తాయి, ఇక్కడి ప్యాలెస్‌లు రొమాంటిక్ ఫీల్ ఇస్తాయి. అందమైన బీచ్ లు, ఆహ్లాదకరమైన నైట్ లైఫ్, ప్రైవసీ కోరుకునే జంటలకు గోవా బెస్ట్ రొమాంటిక్ డెస్టినేషన్. పశ్చిమకనుమలలో ఉన్న మున్నార్ విశాలమైన తేయాకు తోటలు, పొగమంచుతో కప్పబడిన కొండలకు ప్రసిద్ధి. సాహస ప్రియులకు స్వర్గధామం మనాలి. పర్వతాలు, సుందరమైన లోయలు, మనోహరమైన కేఫ్ లు రొమాంటిక్ రీట్రీట్ చేస్తాయి. కొత్త జంటలకు అండమాన్ నికోబార్ దీవులు బెస్ట్ రొమాంటిక్ డెస్టినేషన్ . పింక్ సిటీగా పిలిచే జైపూర్ కోటలు, రాజభవనాలు కపుల్స్‌కు రాయల్ ఎక్స్‌పియరెన్స్ అందిస్తాయి. పచ్చని తేయాకు తోటలు, కాంచనగంగా నది, సుందరమైన హిల్ స్టేషన్లకు ఫేమస్ డార్జిలింగ్. ఆధ్యాత్మికత కోరుకునే జంటలకు రిషికేష్ బెటర్ ఆప్షన్. అందమైన బీచ్ లు, నిర్మలమైన అరబిందో ఆశ్రమం ఉన్న పాండిచ్చేరి విహారయాత్రకు మంచి ఎంపిక. లాంగ్ జర్నీ, సాహసాలను ఇష్టపడే జంటలకు లేహ్-లడఖ్ మరపురాని అనుభూతిని అందిస్తుంది.