బలమైన ఎముకలు, కండరాలు, గోళ్లు, దంతాలకు కాల్షియం చాలా అవసరం. కాల్షియం తగ్గితే గోళ్లు పెళుసుగా మారి త్వరగా విరిగిపోతాయి. కండరాలు, ఎముకల పటుత్వానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియం తగ్గినపుడు ఎముకలు, కండరాలు బలహీన పడతాయి. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం తగినంత ఉండాలి. లేకపోతే చిగుళ్ల వ్యాధులు రావచ్చు. దీర్ఘకాలం పాటు కాల్షియం లోపం కొనసాగితే అది ఆస్టియోపొరోసిస్ అనే ఎముకల వ్యాధికి కారణం అవుతుంది. ఆస్టియోపీనియా అనే మరో రకమైన ఎముకల బలహీనత కూడా ఏర్పడవచ్చు. కాల్షియం మానసిక ఆరోగ్యానికి కూడా అవసరం. కాల్షియం తగ్గితే డిప్రెషన్‌కు గురవ్వుతారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే