Peddi Vs Paradise: రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - నాని 'ప్యారడైజ్' కూడా అప్పుడే.. ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే..
Peddi Movie Release Date: గ్లోబల్ స్టార్ పెద్ది ఓవైపు.. నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మరోవైపు. ఇక వచ్చే ఏడాది సమ్మర్‌కు బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Ram Charan's Peddi Movie Release Date Annouced: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మూవీ అంటేనే ఓ స్పెషల్ క్రేజ్. ఆయన హీరోగా 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తోన్న అవెయిటెడ్ మూవీ 'పెద్ది' (Peddi). తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా వేరే లెవల్‌లో ఉంది. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని గ్లింప్స్‌లోనే మేకర్స్ స్పష్టం చేశారు.
నాని 'ప్యారడైజ్' కూడా
మరోవైపు.. నేచురల్ స్టార్ నాని (Nani), దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise). ఈ సినిమా సైతం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న మూవీ భారీ హైప్ క్రియేట్ అవుతోంది. సినిమాలో నాని రోల్ డిఫరెంట్‌గా ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన ఫస్ట్ లుక్‌లో రెండు జడలు వేసుకుని కనిపించడం ఈ గాసిప్‌కు బలం చేకూర్చింది.
Also Read: పూరీ జగన్నాథ్ - విజయ్ సేతుపతి మూవీలో బాలీవుడ్ హీరోయిన్? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
ఒకేసారి ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాలు థియేటర్లలో సందడి చేయనుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇద్దరు హీరోల మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ ఒకేసారి వస్తుండడం బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోల మధ్య పోటీ కాదని.. ఇది మూవీస్ ఫెస్టివల్ అంటూ చెబుతున్నారు. 'పెద్ది'లో రామ్ చరణ్, 'ది ప్యారడైజ్'లో నాని ఇప్పటివరకూ చూడని డిఫరెంట్ రోల్స్‌లో నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఇంకా హైప్ క్రియేట్ అవుతోంది. మరి ఆ ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేయాలంటే వచ్చే ఏడాది మార్చి 26, 27 వరకూ ఆగాల్సిందే.
గ్లింప్సెస్ వేరే లెవల్ అంతే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ తాజాగా రిలీజ్ కాగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో క్రికెట్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కుతుండగా.. 'ఒకే పని చేసేనాకి.. ఒకేనాగా బతికేనాకి.. ఇంతపెద్ద బతుకెందుకు?.' అంటూ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో చెప్పే డైలాగ్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా.. 'పెద్ది పెద్ది' అంటూ సాగే బీజీఎం ఆకట్టుకుంటోంది.
సినిమాలో వింటేజ్ చరణ్‌ను చూడడం ఖాయమని గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన అందాల నటి జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నాని 'ప్యారడైజ్' గ్లింప్స్ కూడా..
మరోవైపు, నాని 'ది ప్యారడైజ్' మూవీ గ్లింప్స్ సైతం అంతే హైప్ క్రియేట్ చేస్తోంది. 'చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాశారు కానీ.. అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఎవరూ రాయలేదు.' సాగై డైలాగ్స్ ఆకట్టుకోగా.. నాని యాక్షన్, లుక్ అదిరిపోయాయి. ఈ సినిమా 1960 బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రాబోతున్నట్లు తెలుస్తుండగా.. హీరో నాని పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమాపై రూమర్లు రాగా.. టీం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

