Anasuya Bharadwaj: అనసూయ సినిమా రిలీజ్ ఎందుకు లేట్ అవుతోంది? బీజేపీ పెద్దల సపోర్ట్ ఉన్నా కష్టాలు ఎందుకు?
Ari Movie Release Update: 'పేపర్ బాయ్' దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన తాజా సినిమా 'అరి'. బీజేపీ అగ్ర నాయకుల సపోర్ట్ ఉన్నా ఈ సినిమాకు ఎందుకు కష్టాలు వెంటాడుతున్నాయో మరి?

స్టార్ యాక్ట్రెస్, ఒకప్పటి యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఓ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'అరి'. మై నేమ్ ఈజ్ నోబడీ... అనేది ఉప శీర్షిక. (Ari: My Name Is Nobody Movie). 'పేపర్ బాయ్' సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టిన దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన తాజా చిత్రమిది. ఆల్మోస్ట్ రెండేళ్ల నుంచి ఈ సినిమా వార్తల్లో నిలబడుతోంది. ఈ సినిమా ఆలస్యానికి కారణం ఏమిటి? అని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
నాగ్ అశ్విన్ చేతుల మీదుగా కొత్త పాట విడుదల
తెలుగు తెరపై ఇంత వరకు ఎవరు టచ్ చేయనటువంటి అరిషడ్వర్గాలపై స్టోరీ రాసుకుని దర్శకుడు జయశంకర్ తీసిన సినిమా 'అరి'. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, 'డైలాగ్ కింగ్' సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి తారలు నటించారు. తాజాగా ఈ సినిమా థీమ్ సాంగ్ 'కల్కి 2898 ఏడీ' దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేశారు. 'భగ భగ...' అంటూ సాగే ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మరోసారి 'అరి' వార్తల్లోకి వచ్చింది.
నిజానికి గత ఏడాదిలో 'అరి' సినిమా విడుదల కావాల్సింది. అప్పట్లో ప్రమోషన్స్ కూడా చేశారు. టీజర్, ట్రైలర్, ఇంకా మంగ్లీ పాడిన కృష్ణుడి పాట విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రాలు అన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంతి కిషన్ రెడ్డి వంటి బీజేపీ అగ్ర నాయకులు ఈ చిత్రానికి మద్దతుగా ప్రచార కార్యక్రమాలకు తమవంతు చేయూత అందించారు.
వెంకయ్య నాయుడితో పాటు 'ఇస్కాన్' ప్రముఖులు, చిన్న జీయర్ స్వామి సహా పలు హిందు సంఘాల ప్రతినిథులు 'అరి' చూసి ప్రశంసలు కురిపించారు. ఎందుకు? ఏమిటి? అనేది తెలియదు కానీ సినిమా మాత్రం విడుదల కాలేదు. ఈ ప్రచారం అంతా జరిగి ఏడాది కావొస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త పాట విడుదల చేసి ప్రచారం ప్రారంభించారు. అప్పట్లో సినిమా విడుదల చేస్తే మంచి బజ్ వచ్చేది. ఆ ఛాన్స్ మిస్ చేసుకోవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రచారం కొత్తగా స్టార్ట్ చేయాల్సి వస్తోంది. ఇప్పుడు కూడా 'భగ భగ...' విడుదల చేశారు కానీ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. బీజేపీ అగ్రనేతల మద్దతు ఉన్న సినిమా థియేటర్లలోకి ఎందుకు రావడం లేదో మరి? ఇటువంటి డిఫరెంట్ కంటెంట్ సినిమాలను వీలైనంత త్వరగా విడుదల చేస్తే మంచిది. ఇప్పుడు డిఫరెంట్ అనుకున్నది కొన్ని రోజులు ఆగితే రొటీన్ కావచ్చు.
గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా మిస్ అయిన జయశంకర్!?
'పేపర్ బాయ్' హిట్ తర్వాత దర్శకుడికి టాప్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. 'అరి' కంటే ముందు గీతా ఆర్ట్స్ సంస్థలో జయశంకర్ ఒక సినిమా చేయాల్సింది. కథ, స్క్రిప్ట్ లాక్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. కానీ, లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. అది పక్కన పెట్టి కొత్త నిర్మాతలతో ఈ 'అరి' సినిమా స్టార్ట్ చేశారు. ఇది ఏమో విడుదల కాలేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

