Malavika Mohanan: నన్నలా చూడాలని ఎందుకు అంత తొందర? నెటిజన్ ప్రశ్నకు మాళవిక షాకింగ్ రిప్లై!
మలయాళీ బ్యూటీ మాళవిక త్వరలో ‘తంగలాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లతో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చింది.

Malavika Mohanan About Marriage: మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రతిష్టాత్మక చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. వరుస పాన్ ఇండియన్ మూవీస్ అవకాశాలు దక్కించుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘తంగలాన్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్నారు. పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ గతంలో ఎప్పుడూ లేని గెటప్ లో కనిపించనున్నారు. KGF నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మాంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
నెటిజన్లతో మాళవిక ఇంటరాక్షన్
త్వరలో ‘తంగలాన్’ విడుదల కానున్న నేపథ్యంలో మాళవిక నెటిజన్లతో ముచ్చటించింది. ‘ఆస్క్ మీ‘ పేరుతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. విక్రమ్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా అనిపించదని చెప్పింది. తొలిసారి తనను కలిసినప్పుడు భయపడ్డానని చెప్పిన ఆమె, ఆ తర్వాత ఫ్రెండ్లీగా ఉన్నట్లు వెల్లడించింది. సెట్ లో అందరితోనూ స్నేహంగా ఉంటారని చెప్పింది. ఆయన అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చింది.
పెళ్లి ఎప్పుడు? అన్న నెటిజన్ ప్రశ్నకు షాకింగ్ రిప్లై
అటు ఇంటరాక్షన్ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాళవిక షాకింగ్ రిప్లై ఇచ్చింది. అన్ని ప్రశ్నలకు చాలా కూల్ గా స్పందించిన ఆమె, పెళ్లి గురించి అడగ్గానే కాస్త అసహనానికి గురైంది. ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?‘ అని నెటిజన్ ప్రశ్నించాడు. అతడి ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. “నన్ను పెళ్లయిన వ్యక్తిగా చూడటానికి ఎందుకు తొందరపడుతున్నావు” అని రిప్లై ఇచ్చింది.
Why you in a rush to see me married? :( https://t.co/epaOAhywvs
— Malavika Mohanan (@MalavikaM_) July 31, 2024
ఆగస్టు 15న ‘తంగలన్’ విడుదల
ఇక మాళవిక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సుమారు దశాబ్దం అవుతోంది. ఇప్పటి వరకు మలయళం, కన్నడ, తమిళంలో పలు సినిమాలు చేసింది. ఆగస్టు 15న ‘తంగలన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది. ఈ చిత్రంలో మాళవిక మంత్రగత్తెగా కనిపించనుంది. ఈ సినిమా హిట్ కొడితే అమ్మడు దశ తిరిగిపోనుంది. అటు బాలీవుడ్ లోనూ ఆమె అడుగు పెట్టబోతోంది. ప్రస్తుతం 'యుద్ర' అనే సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నది. అటు తెలుగులో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘రాజాసాబ్’ అనే సినిమాలో చేస్తోంది. ఈ సినిమాతో అమ్మడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే ఈ సినిమాలో మాళవిక కు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు లీక్ అయ్యాయి. మార్కెట్ లో విలన్స్ ను చితకబాదే సీన్ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో హల్ చల్ చేశాను.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

