ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహనన్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె శారీలో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం మాళవిక చేతిలో క్రేజీ సినిమాలు ఉన్నాయి. విక్రమ్ సరసన ‘తంగలాన్’లో మాళవిక నటిస్తున్నారు. అలాగే ప్రభాస్, మారుతిల సినిమాలో కూడా మాళవికనే హీరోయిన్. తెలుగులో ఆమెకు ఇదే స్ట్రయిట్ సినిమా. బాలీవుడ్‌లో కూడా మాళవిక ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇవన్నీ వచ్చే సంవత్సరం విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇవి సక్సెస్ అయితే మాళవిక స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే. ఈ సంవత్సరం క్రిస్టీ అనే మలయాళం సినిమాలో మాళవిక నటించారు.