అన్వేషించండి

Director Bobby Birthday: తొలి సినిమాకే అవార్డు, మూడో సినిమాకే రూ. 100 కోట్ల గ్రాస్‌ - #NBK109 డైరెక్టర్ బాబీ బర్త్‌డే గ్లింప్స్ చూశారా?

Happy Birthday Director Bobby: టాలీవుడ్ టాలంటేడ్ డైరెక్టర్‌ బాబీ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అంతేకాదు NBK109 సెట్‌ నుంచి బర్త్‌డే గ్లింప్స్ రిలీజ్‌ చేశారు. 

Director Bobby Birthday Glimpse: టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్లలో బాబీ అలియాస్ కేఎస్‌ రవీంద్ర ఒకరు. మాస్, కమర్షియల్ సినిమాలకు బాబీ కేరాఫ్‌ అడ్రస్‌. ప్రతి సినిమాలో తన మార్క్‌ కనిపించేలా కామెడీ మాస్‌, కమర్షియల్‌ టచ్‌ ఇస్తుంటాడు. ఆయన డైరెక్షన్‌కు ప్రత్యేకమైన శైలీ ఉంటుంది. చేసింది నాలుగు అయిదు సినిమాలే అయినా ఇండస్ట్రీకి భారీ హిట్స్, బ్లాక్‌బస్టర్స్ హిట్స్‌ ఇచ్చాడు. ఎంట్రీతో మాస్ మాహారాజ రవితేజతో సినిమా తీసి సూపర్‌ హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత అందరు స్టార్ హీరోలనే లైన్లో పెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేష్‌,బాలకృష్ణ వంటి అగ్ర నటులతో సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో స్టార్‌ డైరెక్టర్‌ కొనసాగుతున్నాడ. నేడు ఈ యంగ్‌ అండ్ టాలంటెడ్ డైరెక్టర్‌ బాబీ బర్త్‌డే.  ఆగస్ట్‌ 1న ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. 

NBK109 నుంచి బర్త్ డే గ్లింప్స్

ఆయన బర్త్‌డే సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, NBK109 సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ కార్తీక్ కన్నన్‌ బాబీకి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. NBK109 నుంచి ఆయనతో దిగిన ఫోటో షేర్ చేస్తూ సినిమాటోగ్రాఫర్ విజయ్‌ కార్తీక్ కన్నన్. అంతేకాదు NBK109 సెట్స్‌లో బాలకృష్ణ టీం బర్త్ డే కేక్ కట్ చేసి బాబీకి శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే NBK109 మూవీ సెట్‌లో బిహైండ్‌ ది సెట్స్ వీడియో రిలీజ్‌ చేశారు. బాబీ బర్త్‌డే గ్లింప్స్‌ పేరుతో NBK109 సెట్‌ నుంచి సర్‌ప్రైజింగ్ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో NBK109 మూవీ చేస్తున్న బాబీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరులో జన్మించాడు.

రవితేజ పవర్ సినిమాతో ఎంట్రీ

Director Bobby Birthday Glimpse: ఆయన అసలు పేరు కొల్లి సంతోష్ రవీంద్ర. గుంటూరులోనే పుట్టి పెరిగిన రవీంద్ర బి.కామ్ (B.com) చదివాడు. డిగ్రీ పట్టాపొందిన ఆయన సినిమాలపై ఆసక్తితో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ మొదలుపెట్టాడు. 2003లో రచయిత చిన్న కృష్ణ వద్ద చేరాడు. ఆ తర్వాత దశరధ్, గోపీచంద్ మలినేనితో సహా పలువురు దర్శకుల దగ్గర పనిచేశాడు. అదే సమయంలో మాస్‌ మహారాజ రవితేజ పవర్‌ (2014) చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. పస్ట్‌ మూవీతో మంచి విజయం సాధించాడు. ఈ సినిమాకు గానూ డెబ్యూ డైరెక్టర్ గా సంతోషం అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ తెరకెక్కించాడు. రెండో సినిమాకే దారుణమైన డిజాస్టర్ చూశాడు. ఆ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌తో జై లవకుశ (2017) సినిమా తెరకెక్కించాడు.

లవకుశతో రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు

ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసింది. మూడో సినిమాకే డైరెక్టర్ బాబీ ఇండస్ట్రీ వందకోట్ల సినిమాను అందించాడు. ఇక కెరీర్ పరంగా మరింత దూకుడు చూపించాడు. అలా వరుసగా వెంకటేష్‌త-నాగ చైతన్యతో 'వెంకీ మామ', చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి సినిమాలు రూపొందించ హిట్స్ అందకున్నాడు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో NBK109 సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మవీ గ్లింప్స్ ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక మూడో సినిమాకే ఇండస్ట్రీకి వంద కోట్ల గ్రాస్‌ సినిమా అందించి బాబీ భవిష్యత్తులో మరేన్నో మైలు రాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు.. హ్యాపీ బర్త్‌డే డైరెక్టర్‌ బాబీ. 

Also Read: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఇంట తీవ్ర విషాదం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Embed widget