నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు

ఈ నేపథ్యంలో ఆయనను సన్మానిస్తూ గోల్డెన్‌ జూబ్లీ ఈవెంట్‌కు భారీగా ఏర్పాట్లు జరగబోతోన్నాయి

ఈ కార్యక్రమానికి భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు

ఈ నేపథ్యంలో బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ ఈవెంట్‌ ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు

ఇందులో బాలయ్య సినీరంగానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా తయారు చేయించారట

ఈ మేరకు ఈ గోల్డెన్‌ జూబ్లీ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక వైరల్‌ అవుతుంది

బాలయ్య కెరీర్‌లో 100 రోజుల నుంచి 1000 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి

భారత సినీ పరిశ్రమకు చెందిన నటుల్లోకేల్ల 129 మంది హీరోయిన్లతో ఆడిపాడిన ఒక్కేఒక్క నటుడు

ఈ 50 ఏళ్లలో బాలయ్య 108 సినిమాల్లో నటించారు, ప్రస్తుతం 109 మూవీ షూటింగ్ జరుపుకుంటుంది

డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లో బాలయ్య 109వ మూవీ తెరకెక్కనుంది

Image Source: All Images Credit: manabalayya.com/Twitter